Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమ్మాయిలు, డబ్బులే: సునంద పుష్కర్

Sunanda Pushkar
న్యూఢిల్లీ: ఐపియల్ మొత్తం డబ్బులు, అమ్మాయిలు తప్ప మరేమీ లేదని కొచ్చి ఐపియల్ జట్టు ఫ్రాంచైజీ వివాదంలో ఇరుక్కున్న మాజీ మంత్రి శశిథరూర్ స్నేహితురాలు సునంద పుష్కర్ అన్నారు. క్రికెట్ లో అందరికీ అమ్మాయిలు, డబ్బులపైనే ఆసక్తి అని అందుకే అందరికీ అనుమానాలు వస్తున్నాయని ఆమె తెహెల్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే తనను అత్యంత నీచంగా చిత్రీకరించారని ఆమె మీడియాపై విరుచుకుపడ్డారు. తననో అందమైన మతిలేనిదానిగా అభివర్ణించాయంటూ ఆక్రోశించారు. మధ్యయుగపు మంత్రగత్తెను వెంటాడి వేధించినట్లు తన పట్ల వ్యవహరించారని ఆగ్రహించారు.

ఐపీఎల్‌లో రావాల్సిన డబ్బు పోయిందన్న బాధ తనకు ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. కొచ్చి ఫ్రాంచైజీ విషయంలో నిజానికి ఒక్క పైసా కూడా ఇంతవరకు చేతులు మారలేదని ఆమె వివరించారు. 'ఒక మహిళగా నేను మంచిదాన్ని కానా?' అని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు స్నేహితురాలిగా తాను గర్విస్తున్నానని సునంద తెలిపారు. 'ఇన్నేళ్లుగా ఆయనపై అవినీతి మచ్చ అన్నదే లేదు. ఇప్పుడు మాత్రం అక్రమాలకు ఎందుకు పాల్పడతారు?' అని ప్రశ్నించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+