అసలేం జరిగింది!: ఐసీసీని ప్రశ్నించిన టాలీవుడ్ నటుడు సుమంత్

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ మెగా టోర్నీలో లీగ్ దశలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారడంతో ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అంతేకాదు ఆ మ్యాచ్ కోసం టిక్కెట్స్ కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులకి ఐసీసీ టికెట్ డబ్బులు తిరిగిస్తామని అప్పట్లో హామీ కూడా ఇచ్చింది.

మ్యాచ్ రద్దు డబ్బులను తిరిగి చెల్లించకపోవడంతో
ఇప్పటివరకు మ్యాచ్ రద్దు డబ్బులను తిరిగి చెల్లించకపోవడంతో టాలీవుడ్ నటుడు సుమంత్ తన ట్విట్టర్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను వీక్షించేందుకు గాను భారత్ నుంచి అనేక మంది సెలబ్రిటీలు అప్పట్లో యునైటెడ్ కింగ్‌డమ్‌కు బయల్దేరి వెళ్లారు.
రెండు నెలలైనా రిఫండ్ ఇవ్వకపోవడంతో
వరల్డ్‌కప్ ముగిసి రెండు నెలలైనా రిఫండ్ ఇవ్వకపోవడంతో సుమంత్ తన ట్విట్టర్‌లో స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "ఐసీసీ గ్యారంటీ ఇచ్చినా జూన్ 13న భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు డబ్బులను టికెటింగ్ ఏజెంట్లు రిఫండ్‌ను తిరిగి చెల్లించలేదు. నెలలు గడుస్తున్నాయి. ఈ సమస్యపై స్పందించండి" అంటూ ఐసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

వర్షం కారణంగా టాస్ పడకుండానే
నాటింగ్‌హామ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే. ఒక దశలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ జరుగుతుందని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. వర్షం ఆగినట్లే ఆగి మళ్లీ కురుస్తుండటంతో చివరకు మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇరు జట్లకు చెరో పాయింట్
అంపైర్లు మ్యాచ్‌ని రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా రద్దైన నాలుగో మ్యాచ్ ఇది. అందులో రెండు శ్రీలంక మ్యాచ్‌లే కావడం విశేషం. బ్రిస్టల్‌లో శ్రీలంకతో పాకిస్థాన్ మ్యాచ్ రద్దయింది. ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ల రద్దు ప్రభావం శ్రీలంక, పాక్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications