
హైదరాబాద్: భారత దేశపు అత్యున్నత సంపన్నక లీగ్ ఐపీఎల్. దేశంలోని అన్ని లీగ్‌ల కంటే తక్కువ సమయంలోనే మంచి మన్ననలు పొందింది. అంతేకాదు, దీంతో పాటు రూమర్లు, వివాదాలు కూడా ఐపీఎల్ కు కొత్తే కాదు. ఇలాంటిదే మరొకటి ఐపీఎల్‌లో వెలుగు చూసింది. ఈ విషయాన్ని బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యన్ స్వామి అనే రాజకీయ నాయకుడు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు.
మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఐపీఎల్ ద్వారా భారత్‌లోని డబ్బు మూడో వంతు నల్లధనంగా మారబోతోంది. అందులో కేవలం ఐపీఎల్ టిక్కెట్లు అనేది చాలా చిన్న విషయం. బ్రాడ్ కాస్ట్ ఖర్చుల నిమిత్తం ఖర్చు చేసే 150 వేల కోట్లు సైతం నల్లధనం కిందకే మారనుంది. ఇంతే కాకుండా వేలం ద్వారా కూడా ఫ్రాంచైజీలు నల్లధనాన్ని మారుస్తుంటాయి.
సదరు విషయంపై సుబ్రహ్మణ్యన్ స్వామి ఐపీఎల్ చైర్మన్ అయిన రాజీవ్ శుక్లాపై కోర్టులో కేసును కూడా నమోదు చేశారట. ఇటీవలే ఐపీఎల్ కమిటీ ప్రసార హక్కులను రూ.16 వేల కోట్లకు స్టార్ ఇండియాకు అమ్మేసింది. దీని గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్ స్టార్ ఇండియా నల్లధనాన్ని మార్చుకునేందుకు భారీ స్థాయిలో సాయపడిందని తెలిపాడు.
రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్‌లోకి భారీ అంచనాలతో చెన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టబోతోంది. దీని గురించి స్పందించిన ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కావాలనే మ్యాచ్ ఫిక్సింగ్ అంటించారు. చెన్నై సూపర్ కింగ్స్ నిషేదం ఎత్తివేయాలంటూ సీఎస్‌కే పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ హస్తం కూడా ఉందని పేర్కొన్నారు.