న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాట్టూలు.. ఇయర్ రింగ్స్.. హెయిర్ స్టైల్ అవే వస్తాయ్: కోహ్లీ

Style Icon Virat Kohli Always Cared The Most About Winning

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జట్టుతో ఆఖరిదైన టెస్టు సిరీస్‌కు భారత జట్టుతో సిద్ధమైయ్యాడు. ఈ నేపథ్యంలో అతని ఆట తీరు గురించి.. అనుసరించే స్టైల్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. కోహ్లీ తన కెరీర్ మొదలుపెట్టినప్పుడు స్టైలిష్ ఏం కాదు. అందరిలాగే మామూలు వ్యక్తిగానే మొదలుపెట్టాడని తెలిపాడు. అందరూ అనుకుంటారు కోహ్లీ.. స్టైల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని దానిలో అంతా నిజం లేదని ఇలా వివరించాడు.

'నిజం ఏమిటంటే, పని బాగా చేశామంటే, నా ఉద్దేశ్యమేంటంటే ఆటలో చక్కగా ప్రదర్శించగలిగామంటే టాట్టూలు వాటంతటవే వస్తాయి. ఇంకా నన్నిలా చూసి యువ క్రికెటర్లు కొన్ని అపోహలు వీడతారు కూడా. ఇలా ఉండకూడదు. అలా ఉండకూడదనే భ్రమలు కూడా వీడిపోతాయి. నీకు ఇయర్ రింగ్స్ ఉన్నాయనుకో.. శరీరం మీద టాట్టూలు ఉన్నాయనుకో.. కొత్త హెయిర్ స్టైల్‌తో ఉన్నావనుకో.. వాటి మీద ప్రేమ పెంచేసుకుని ఫీల్డింగ్ చేసేటప్పుడు అవి చెదిరిపోతాయని బాధపడితే గేమ్ సరిగా ఆడలేవు'

'కెప్టెన్‌గా ఉండి అండర్ 19 వరల్డ్ కప్‌ను 2008వ సంవత్సరంలో గెలుచుకున్నప్పటి నుంచి గెలవడం అనేది తప్పనిసరి అయిపోయింది. కానీ, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా అయినప్పటి నుంచి బాధ్యత పెరిగింది. ఓటములను కూడా అదే స్థాయిలో స్వీకరించగల్గుతున్నా. ఇప్పుడు ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోగల్గుతున్నా. ఇప్పడు నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. మైదానంలో బాగా కష్టపడితే కావాలనుకున్నవన్నీ అవే తిరిగొస్తాయి. అప్పుడే మనం వెలుగులోకి వస్తాం. ఇది దేశం గురించి మనం ఏదైనా చేయడానికి అపూర్వ అవకాశం' అని భావిస్తున్నానని తెలిపాడు.

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభమైంది. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లాండ్‌కు ఈ టెస్టు మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుకు 1000వ టెస్టు. 1877లో టెస్టు హోదా పొందిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడింది. ఇప్పటివరకు 999 మ్యాచ్‌లు పూర్తి చేసింది. ఇందులో 357 టెస్టులు గెలువగా, 297 మ్యాచ్‌ల్లో ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

Story first published: Wednesday, August 1, 2018, 18:05 [IST]
Other articles published on Aug 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X