Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆశలన్నీ ఐపీఎల్‌పైనే: తొలిసారి మీడియా ముందుకు స్టీవ్ స్మిత్

Stunned with BPL axe, Steve Smith eyeing IPL 2019 as perfect platform for ICC World Cup spot

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికి పీఎస్ఎల్, ఐపీఎల్‌లు సరైన ఫ్లాట్ ఫామ్స్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. బాల్ టాంపరింగ్‌ ఘటనతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్‌ను బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి బహిష్కరిస్తున్నట్టు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

స్మిత్‌పై కొన్ని ఫ్రాంచైజీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బంగ్లా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 5నుంచి జరుగనున్న బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌ జట్టుకు ఆడేందుకు స్మిత్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో మీడియాతో మాట్లాడాడు.

"బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. అయితే, ఏం జరిగిందో నాకు తెలియదు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ముందు నేను ప్రిపరేషన్ అయ్యేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లు ఉన్నాయి. అది కూడా ఈ లీగ్‌ల్లో నేను సెలక్ట్ అయితే" అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.

వన్డే గేమ్ ఎలా ఉందంటే

వన్డే గేమ్ ఎలా ఉందంటే

"ప్రస్తుతం వన్డే గేమ్ ఎలా ఉందంటే... టీ20లకు కాస్త కొనసాగింపు మాత్రమే. దీంతో టీ20 క్రికెట్ ప్రిపేర్ అయ్యేందుకు మంచి మార్గం. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి. రోజురోజుకు నేను సిద్ధంగానే ఉన్నా. ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడేందుకు ఉన్న ప్రతి మార్గాన్ని చక్కగా వినియోగించుకోవాలని చూస్తున్నా" అని స్మిత్ అన్నాడు.

బాల్ టాంపరింగ్ ఘటనలో దోషులుగా

బాల్ టాంపరింగ్ ఘటనలో దోషులుగా

బాల్ టాంపరింగ్ ఘటనలో దోషులుగా తేలిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో ఐపీఎల్ 2018 సీజన్‌కు వీరిద్దరూ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందే వీరిపై నిషేధం తొలగిపోనుండటంతో ప్రాంఛైజీలు వీరిని అట్టిపెట్టుకున్నాయి.

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో బరిలోకి స్మిత్, వార్నర్

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో బరిలోకి స్మిత్, వార్నర్

దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరూ ఆయా జట్ల తరుపున బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు.

వేలంలో 60 మందిని కోనుగోలు చేసిన ప్రాంఛైజీలు

వేలంలో 60 మందిని కోనుగోలు చేసిన ప్రాంఛైజీలు

ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 21, 2018, 16:43 [IST]
Other articles published on Dec 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+