వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా!: శ్రీశాంత్ అనూహ్య నిర్ణయం
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వేరొక దేశం తరుపున క్రికెట్ ఆడే యోచన చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా శ్రీశాంత్ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై అతడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇకపై టీమిండియా ఆడే అవకాశం లేకపోవడంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దుబాయ్‌లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌కు హాజరైన శ్రీశాంత్ తాను వేరే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ఆసియా నెట్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో స్పష్టం చేశాడు. 'నన్ను బీసీసీఐ నిషేధించింది. అంతేకానీ ఐసీసీ కాదు. నేను భారత్ తరుపున క్రికెట్ ఆడలేనప్పుడు, వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా?' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

నా వయసు ఇంకా 34 ఏళ్లే
'నా వయసు ఇంకా 34 ఏళ్లే. నా కెరీర్ చాలా ఉంది. ఇంకా ఆరేళ్లుగా పైగా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఒక వ్యక్తిగా నాకు క్రికెట్ అంటే ఇష్టం. అందుచేత క్రికెట్నే ఆడాలనుకుంటున్నా. బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అలానే వేరే దేశానికి క్రికెట్ ఆడతా. నాపై నిషేధం కొనసాగించే నిర్ణయం బీసీసీఐకే వదిలేశా' అని శ్రీశాంత్ స్పష్టం చేశాడు.

2013లో స్ఫాట్ ఫిక్సింగ్
2013లో శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ అతడిపై నిషేధం విధించింది. అయితే బీసీసీఐ నిషేధాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేయగా, ఆగస్టు 7న సింగిల్ జడ్జి బెంచ్ అతడిని నిర్దోషిగా తేల్చింది. అయితే దీనిపై బీసీసీఐ మళ్లీ కేరళ హైకోర్టుకు వెళ్లింది.

బీసీసీఐకి అనుకూలంగా తీర్పు
దీంతో తాజాగా మంగళవారం ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్, జస్టిస్ రాజా విజయరాఘవన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసి, శ్రీశాంత్ నిషేధాన్ని కొనసాగించింది. బీసీసీఐకి అనుకూలంగా తీర్పు రావడంపై శ్రీశాంత్ ట్విట్టర్‌లో మండిపడ్డాడు.

మరి అసలు దోషుల సంగతేంటి?
'నిషేధం ఓ చెత్త నిర్ణయం. నా కోసమే అన్నట్లుగా ఉంది ఈ నిబంధన. మరి అసలు దోషుల సంగతేంటి? చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌లపై నిషేధం విధించరా? లోధా నివేదికలోని 13 మంది నిందితులపై ఏ నిర్ణయం తీసుకుంటారు. ఇది ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదా?' అని ట్విట్టర్‌లో శ్రీశాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications