లక్నో సూపర్ జెయింట్స్ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అంతేగాక ఐపీఎల్ 2024లో వేగవంతమైన బంతిని విసిరి రికార్డులకెక్కాడు.
నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ ఈ ఘనత సాధించాడు. 155.8 కి.మీ/గంట వేగంతో బాల్‌ను విసిరాడు. మయాంక్ మ్యాజికల్ స్పెల్‌తోనే 11.4 ఓవర్లకు 102/0తో పటిష్టస్థితిలో ఉన్న పంజాబ్ ఛేదనలో 20 ఓవర్లకు 178/5 స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 199 పరుగులు చేసింది.

అయితే ఈ సంచలన స్పీడస్టర్ మయాంక్ యాదవ్ త్వరలోనే టీమిండియాలో చోటు సంపాదిస్తాడని ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని, అతడి పట్ల ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలని బ్రాడ్ పేర్కొన్నాడు.
''మయాంక్ యాదవ్ సహజమైన పేస్ కలిగి ఉన్నాడు. అంతేగాక ఈ యువ బౌలర్ ఎంతో నియంత్రణతో లైన్ అండ్ లెంగ్త్‌తో అసాధారణంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఓ యువ బౌలర్ ఎమోషన్‌తో వీలైనంత వేగంగా బౌలింగ్ వేయాలని చూస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో లెంగ్త్ మిస్ అవుతుంటుంది. కానీ మయాంక్ గొప్పగా బౌలింగ్ చేశాడు''

''జానీ బెయిర్‌స్టో బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా గొప్ప షాట్‌యే ఆడాడు. కానీ మయాంక్ అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడిన బెయిర్‌స్టోను బోల్తాకొట్టించాడంటే అతనిలో ప్రత్యేకత ఉంది. ఆ యువ బౌలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కడం ఆనందంగా ఉంది. ఓ ఫాస్ట్ బౌలర్ అవార్డు తీసుకుంటే నా ముఖంలో చిరునవ్వు వస్తుంది. అయితే భవిష్యత్ గురించి ముందే ఎక్కువగా ఆలోచించకూడదు. కానీ ఈ యువ బౌలర్ మయాంక్ గురించి స్టీవ్ స్మిత్‌కు మెసేజ్ చేసేశా. ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్టు సిరీస్‌లో మయాంక్ ఉంటే.. ఎదుర్కోవడానికి స్మిత్ ముందుగానే సిద్ధమవ్వాలని చెప్పా'' అని బ్రాడ్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అయిదు టెస్టులు ఆడనుంది. నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో ఓ డే/నైట్ టెస్టు కూడా ఉంది. నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు సిరీస్ జరగనుంది.