ఈ వీడియో ఏంది ఇవాళ ఇన్నిసార్లు రీట్వీట్ అవుతుంది.. డేవిడ్ వార్నర్‌పై బ్రాడ్ సెటైర్స్

హైదరాబాద్ : ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆ దేశ అత్యుత్తమ ఆటగాడిగా అలెన్ బోర్డర్ పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో వార్నర్ ఒక్క ఓటు తేడాతో స్టీవ్ స్మిత్‌ను వెనక్కు నెట్టి ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

ఈ రోజే ఎందుకబ్బా..?

అయితే ఈ అత్యుత్తమ అవార్డును అందుకున్న డేవిడ్ వార్నర్‌పై స్టువర్ట్ బ్రాడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. యాషెస్ సిరీస్‌లో వార్నర్ వైఫల్యాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. పైగా ఆ సిరీస్‌లో తన బౌలింగ్‌లోనే ఎక్కువ సార్లు ఔటయ్యాడనే విషయం తెలియజేసే‌లా ఓ వీడియో ట్వీట్‌ను రీ ట్వీట్ చేశాడు. పైగా దానికి ‘ఆకస్మాత్తుగా ఈ వీడియో ఈ రోజు ఇన్నిసార్లు ఎందుకు రీట్వీట్ అవుతుంది ? 'అనే క్యాప్షన్ ఇచ్చాడు.

యాషెస్ సిరీస్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ ఏడు సార్లు స్టువర్ట్ బ్రాడ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ అప్పట్లో ట్వీట్ చేసింది. ఇక వార్నర్ అత్యుత్తమ ఆటగాడిగా అలెన్ బోర్డర్ మెడల్ అందుకోగానే బ్రాడ్ వీడియోను రీట్వీట్ చేశాడు.

‘నామ్ ఏక్.. కామ్ అనేక్'.. రాహులా నువ్వు సూపరో సూపర్!

యువీ బాదుడు మరిచిపోయావా?

యువీ బాదుడు మరిచిపోయావా?

ఇక వార్నర్‌ను కించపరిచేలా ట్వీట్ చేసిన బ్రాడ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ బౌలింగ్‌ను చితక్కొట్టిన యువరాజ్‌ సిక్స్ సిక్సర్లను మరిచిపోయావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నీ చెత్త ప్రదర్శన ముందు వార్నర్ వైఫల్యం ఏం దారుణం కాదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

నిషేదాంతరం..

నిషేదాంతరం..

బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో మోసగాడిగా ముద్ర వేయించుకుని ఏడాది పాటు నిషేధానికి కూడా గురైన వార్నర్.. ఇప్పుడు ఆ దేశ క్రికెట్‌ హీరోగా నిలిచాడు. నిషేధానంతరం పునరాగమనంలో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలుత ఐపీఎల్-12లో హైదరాబాద్ జట్టు తరపున పరుగుల వరద పారించాడు. ఆపై ప్రపంచకప్, యాషెస్ టోర్నీలలో మెరిశాడు. ప్రస్తుతం ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో సీఏ అతడికి ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ పతకాన్ని అందజేసింది. 2016, 2017లోనూ వార్నర్‌ ఈ పతకాన్ని అందుకున్నాడు.

స్మిత్‌తో పోటీ..

స్మిత్‌తో పోటీ..

టాంపరింగ్‌కు పాల్పడి 12 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ కూడా ఈ అవార్డు రేసులో నిలిచినా.. వార్నర్‌ ఒక్క ఓటు తేడాతో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వార్నర్‌కు 194 ఓట్లు రాగా.. స్మిత్ 193 ఓట్లు దక్కించుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ 185 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక బెలిండా క్లార్క్‌ పతకాన్ని ఆసీస్‌ మహిళల క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ సాధించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, February 11, 2020, 14:06 [IST]
Other articles published on Feb 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X