హైదరాబాద్: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాండ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఎడ్జిబాస్టన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో బ్రాడ్ ఈ ఘనత సాధించాడు.
వెస్టిండిస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రాడ్ మూడు వికెట్లు తీయడం ద్వారా 384వ టెస్టు వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ సర్ ఇయాన్ బోథమ్(383) రికార్డును బ్రాడ్ అధిగమించాడు. ఇక ఇంగ్లండ్ తరుపున జేమ్స్ ఆండర్సన్ 492 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

మూడు రోజుల్లోనే ముగిసిన ఈ డే-నైట్ టెస్టులో వెస్టిండిస్‌పై ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 514 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఆలౌటైంది.
ఫాలో ఆన్ ఆడిన విండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగుల వద్ద ఆలౌటైంది. విండీస్ ఆటగాళ్లలో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్ వైట్(40)మినహా ఎవరూ రాణించలేదు. మూడో రోజు ఇంగ్లండ్ బౌలర్లు 19 వికెట్లు తీయడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 3 వికెట్లు తీయగా అండర్సన్, రోలాండ్ జోన్స్, మొయిన్ అలీలు తలో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్‌కు ఒక వికెట్ లభించింది.