Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ జెర్సీని భద్రంగా దాచుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్

హైదరాబాద్: ప్రముఖ వ్యక్తుల నుంచి అందుకున్న బహుమతులను అభిమానులు ఎంతో అపురూపంగా దాచుకుంటూ ఉంటారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన జెర్సీని భద్రంగా దాచుకున్నట్లు ఇంగ్లాండ్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

కోహ్లీ జెర్సీతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్‌ జాన్సన్‌, ఇంగ్లాండ్‌కు చెందిన డారెన్‌గాఫ్‌, పాకిస్థాన్‌కు చెందిన యూనిస్‌ ఖాన్‌లకు చెందిన జెర్సీలను ఇంట్లో ప్రత్యేక అలమారాలో భద్రంగా దాచుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను స్టువర్ట్ బ్రాడ్ తాజాగా తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

 Stuart Broad on Instagram: Some special shirts off to get framed

'నేను అందుకున్న జెర్సీల్లో ఇవి ప్రత్యేకమైనవి. అందరూ గొప్ప ఆటగాళ్లు' అని పోస్ట్ పెట్టాడు. ఇంగ్లాండ్‌ తరఫున బ్రాడ్‌ 102 టెస్టులు, 121 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షాహిద్‌ అఫ్రిదికి
టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ జెర్సీపై సంతకాలు చేసి బహుమతిగా పంపిన విషయం తెలిసిందే.


టీమిండియా ఆటగాళ్లు అందించిన జెర్సీని తన ఇంట్లో ప్రత్యేకంగా ఫ్రేమ్‌ కట్టించి అఫ్రిది భద్రపరచుకున్న ఫోటోను అఫ్రిదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+