'బ్రాడ్‌ను ఇంతకంటే గొప్ప ఫామ్‌లో ఎప్పుడూ చూడలేదు.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడు'

మాంచెస్టర్‌: టెస్టు క్రికెట్‌ చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్‌ సీనియర్ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌పై ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ ప్రశంసలు వర్షం కురిపించాడు. వెసిండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయిన బ్రాడ్‌ను.. ఇంతకంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవన్నాడు. ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో స్థానం సంపాదించాడంటూ కొనియాడాడు. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు. తద్వారా 499 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

ఇంతకంటే గొప్ప ఫామ్‌లో ఎప్పుడూ చూడలేదు

ఇంతకంటే గొప్ప ఫామ్‌లో ఎప్పుడూ చూడలేదు

తాజాగా ఆండ్రూ స్ట్రాస్‌ మాట్లాడుతూ... 'జేమ్స్ అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్ గొప్ప బౌలర్లు. ఇద్దరు ఎప్పుడూ వికెట్ల వేట కొనసాగిస్తూనే ఉంటారు. ఇంగ్లండ్‌ జట్టుకు దొరికిన గొప్ప ఓపెనింగ్ పేస్ జోడి. సుదీర్ఘకాలంగా అండర్సన్‌తో కలిసి పేస్‌ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్‌ను ఇంతకంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవు. వీరిద్దరూ ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో స్థానం సంపాదించారు. కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్‌ చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్‌ అధిగమించాడు. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు బ్రాడ్‌ జట్టులో లేదు. కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన సిరీస్ లెవలింగ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇక సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో బ్రాడ్‌ చెలరేగిపోవడం హర్షించదగ్గ విషయం' అని అన్నాడు.

500వికెట్లు తీస్తాడని ఊహించలేదు

500వికెట్లు తీస్తాడని ఊహించలేదు

బ్రాడ్​ను తొలినాళ్లలో చూసినప్పుడు అతడు టెస్టుల్లో 500 వికెట్లు సాధిస్తాడని తనతో పాటు ఎవరూ అంచనా వేయలేకపోయారని స్ట్రాస్‌ అన్నాడు. 'బ్రాడ్​ని తొలిసారి చూసినప్పుడు మంచి ఫాస్ట్ బౌలర్ అనుకున్నా. గంటకు 80-85 మైళ్ల వేగంతో బంతులు వేసేవాడు. బాగా ఎత్తుగా కూడా ఉండడంతో రైట్ హ్యాండ్ బ్యాట్స్​మెన్​కు ఔట్ స్వింగర్లు కూడా సమర్థంగా సంధించేవాడు. అయితే ఇలా చాలా మంది అంతకు ముందు వచ్చారు. ఏడాది లేదా రెండేండ్లు బాగా రాణించి ఆ తర్వాత తేలిపోయేవారు. అందుకే బ్రాడ్​ను కూడా ప్రత్యేకంగా చూడలేదు. అసలు అతడు 500 వికెట్లు తీస్తాడని నేనైతే అంచనా వేయలేదు. అయితే ఇంగ్లండ్ తరపున సుదీర్ఘంగా ఆడే సామర్థ్యం అతడికి ఉందని నాతో పాటు మరికొందరు అనుకున్నారు' అని స్ట్రాస్​ తెలిపాడు.

500 వికెట్లతో ఆగడు

500 వికెట్లతో ఆగడు

'చాంపియన్ క్రీడాకారుడిని జట్టులో నుంచి తప్పిస్తే.. మళ్లీ అంతకు మించిన వేగంతో తిరిగి వస్తాడు. ఈ సిరీస్​లో స్టువర్ట్ బ్రాడ్​ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఒక్కోసారి జట్టులో చోటు దక్కనప్పుడే మన గురించి మనకు తెలుస్తుంది. బ్రాడ్ జోరు చూస్తే 500 వికెట్లతో అసలు ఆగడు. 600 వికెట్ల మార్కును చేరాలనుకుంటాడు. ఇప్పటికీ అతడిలో ఎంతో స్టామినా ఉంది. సుదీర్ఘంగా బౌలింగ్ చేయగలడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటాడు' అని అథెర్టన్ అన్నారు. సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్.. బ్రాడ్​ను పక్కనపెట్టాడు. సీనియర్ పేసర్ అయిన బ్రాడ్​ను తప్పించడం కాస్త వివాదాస్పదమైంది.

సిరీస్​ను కైవసం చేసుకోవాలని

సిరీస్​ను కైవసం చేసుకోవాలని

ఇంగ్లండ్​, వెస్టిండీస్ మధ్య మూడో టెస్టు ఆఖరి రోజు ఆట మంగళవారం జరగాల్సి ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు తుడుచికుపెట్టుకుపోయింది. వెస్టిండీస్ గెలుపునకు ఇంకా 389 పరుగుల దూరంలో ఉండడంతో.. ఆ జట్టును ఆలౌట్ చేసి 2-1తో సొంత గడ్డపై సిరీస్​ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.

భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. యూఏఈలోనే ఐపీఎల్ 2020!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, July 28, 2020, 13:42 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X