
ప్రపంచకప్‌లో మెరిసిన వార్నర్:
డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 14 సీజన్‌లో పూర్తిగా తేలిపోయాడు. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. భారత్‌లో జరిగిన తొలి అర్ధ భాగంలో ఫర్వాలేదనిపించిన వార్నర్.. యూఏఈలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ శతకాలతో 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇక హైదరాబాద్ జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్‌ను పక్కనపెట్టి.. కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్సన్‌కు అప్పగించింది. ఇక ఐపీఎల్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దేవ్ 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

చాలా బాధపడ్డాను:
టీ20 ప్రపంచకప్ 2021లో అదరగొట్టిన డేవిడ్ వార్నర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సన్‌రైజర్స్ హైద్రాబాద్ తనని తొలగించడంపై తొలిసారి స్పందించాడు. 'కొన్నేళ్ల పాటు ఎంతో ఇష్టపడిన జట్టు ఉన్నట్టుండి ఏ తప్పూ లేకుండా, ఏ కారణం లేకుండా నన్ను తొలగించడం, కెప్టెన్సీ నుంచి తప్పించడం చేస్తే చాలా బాధపడ్డాను. అయితే ఈ విషయంపై నేనెలాంటి ఫిర్యాదులు చేయాలనుకోవడం లేదు. భారత్‌లో నాకెంతో మంది అభిమానులున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను ఈ ఆట ఆడుతున్నా. అభిమానులను అలరించడానికే నేను ఉన్నాను' అని వార్నర్ అన్నాడు.

మరో అవకాశం ఉందనే నమ్ముతున్నా:
'ఎవరైనా మరింత మెరుగవ్వాలనే కోరుకుంటారు. నన్ను తొలగించడానికి కారణం ఏదైనా కావచ్చు కానీ నేను ఆ ఫ్రాంఛైజీ కోసం నిరంతరం కష్టపడ్డా. రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేశా. నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేశా. అయితే సమయానికి పరుగులు మాత్రం చేయలేకపోయా. అలాంటప్పుడు నన్ను తీసేయడం నిజంగానే బాధ కలిగించింది. ఇక నాకు ఇంకా ఐపీఎల్‌లో ఆడేందుకు మరో అవకాశం ఉందనే నమ్ముతున్నా' అని డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఐపీఎల్ ముగిసి సరిగ్గా నెల రోజులు తిరగకముందే ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్‌లోవార్నర్ ఏకంగా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు.

మరో కారణం ఉంది:
ఐపీఎల్ 2021లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సహా తుది జట్టుకు కూడా దూరంగా ఉంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ స్పందించాడు. పేలవమైన ఫామ్ కారణంగా వార్నర్‌ను తప్పించలేదన్నాడు. 'డేవిడ్ వార్నర్‌ను తప్పించడానికి మరో కారణం ఉంది. అతడు ఫామ్‌లోనే ఉన్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉన్నాడు. నెట్స్‌లో కూడా బాగా ఆడుతున్నాడు. కానీ పరిస్థితులే అతడికి అనుకూలంగా లేవు. చాలా కాలం విరామం తీసుకోవడం వల్ల అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ దూరమైంది. కొన్ని మ్యాచ్‌లు ఆడితే మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేస్తాడు' అని హాడిన్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












