
నెత్తిన టోపీ తప్ప..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ దుర్హం స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి కనిపించింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ప్రేక్షకుల మధ్యలో నుంచి అభిమాని ఒకడు స్టాండ్స్ దాటుకుని గ్రౌండ్స్ మీదికి ప్రవేశించాడు. ఆ సమయంలో అతను నగ్నంగా ఉన్నాడు. సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి గ్రౌండ్ మీదికి వచ్చిన ఒంటి మీద నూలుపోగైనా లేదు. నెత్తి మీద ఓ ఆకుపచ్చని టోపీ తప్ప.

పిచ్‌పై పిచ్చిగా స్టెప్పులు..
గ్రౌండ్ మీదికి వచ్చీ, రాగానే పరుగెత్తుకుంటూ పిచ్ మీదికి వెళ్లాడు. క్రీజులో ఉన్న కివీస్ బ్యాట్స్‌మెన్లు టామ్ లాథమ్, మిఛెల్ శాంట్నర్‌ల ఎదురుగా నిల్చుని స్టెప్పులేశాడు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ఆటగాళ్లు ఎక్కడికక్కడ స్థాణువులైపోయారు. దీన్ని చూసిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకుంటూ వచ్చి అతగాణ్ని లాక్కెళ్లిపోయారు. సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు తన జెర్కిన్‌ను తీసి, అతని మొలకు కప్పాడు. రెక్కలు పట్టుకుని వెనక్కి తీసుకెళ్లిపోయారు.

హాట్ ఫేవరెట్..
హాట్ ఫేవరెట్‌గా ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ టీమ్..ఎట్టకేలకు సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న మూడో జట్టుగా నిలిచింది. రివర్‌సైడ్ దుర్హం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ 119 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఓపెనర్ బెయిర్‌స్టో మరోమారు రెచ్చిపోయాడు. ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. మొదట ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ నష్టానికి 305 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించడంలో న్యూజిలాండ్ విఫలమైంది. 45 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఇంగ్లండ్‌లో సెమీస్ చేరుకుంది.


Click it and Unblock the Notifications












