ఇంగ్లీషు గడ్డపై భువీ కంటే కోహ్లీనే బెటర్..!!

హైదరాబాద్: ప్రత్యర్థితో సంబంధం లేకుండా పరుగులు బాదేయడం విరాట్ కోహ్లీకి అలవాటు. కఠిన పరిస్థితుల్లోనూ క్రీజులో నిలిచి ఒత్తిడిని అధిగమిస్తూ.. విజయాలు అందిస్తుంటాడు. కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత విరాట్ తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై జట్టును నడిపించబోతున్నాడు. ఇంతకుముందు జరిగిన ఇంగ్లిష్ గడ్డపై అతడి బ్యాటింగ్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. కోహ్లీతో పోలిస్తే ఆ దేశంలో పేసర్ భువనేశ్వర్ బ్యాటింగ్ రికార్డు మెరుగ్గా ఉంది.

ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం రాణించలేకపోతున్న కోహ్లీ:
కోహ్లీ.. జట్టు నాయకుడిగా కంటే ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2014లో ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. తొలి మ్యాచ్ డ్రా చేసుకున్న భారత్ 1-3తో సిరీస్ చేజార్చుకుంది. ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 13.40 సగటుతో 134 పరుగుల మాత్రమే చేశాడు. రెండుసార్లు డకౌట్ అయ్యాడు.

భువీ 27.44 సగటుతో 247 పరుగులు
విచిత్రంగా అదే సిరీస్‌లో టెయిలెండర్ భువనేశ్వర్ కుమార్ 27.44 సగటుతో 247 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. అతడే కాదు రెండు మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా సైతం 38.25 సగటుతో 153 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

అన్ని దేశాల్లోనూ వీర విహారం చేసి:
ఇంగ్లాండ్‌ను మినహాయిస్తే విరాట్ కోహ్లీ మిగతా అన్ని దేశాల్లోనూ వీర విహారం చేశాడు. ఆస్ట్రేలియాలో 8 మ్యాచ్‌లు ఆడి 62 సగటుతో 992, దక్షిణాఫ్రికాలో ఐదు మ్యాచ్‌లాడి 55.80 సగటుతో 558, న్యూజిలాండ్‌లో 2 మ్యాచ్‌లు ఆడి 71.33 సగటుతో 214 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో వీరవిహారం చేసి తానేంటో రుజువు చేసుకోవాలన్న కసితో ఉన్నాడు విరాట్.

కోహ్లీనే ప్రధాన టార్గెట్:
ఇదే క్రమంలో కోహ్లీ కసిగా రాణించాలని రవిశాస్త్రి, మిగతా సీనియర్లు సూచిస్తున్నారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు మాత్రం కోహ్లీనే ప్రధాన టార్గెట్‌గా ప్లేయర్లను సిద్ధం చేస్తుంది. కోహ్లీ బ్యాటింగ్ శైలిని విశ్లేషిస్తూ అతనికెలా బౌలింగ్ వేయాలో.. ఎప్పుడు సులువుగా దొరికిపోతాడోననే విషయాలను జట్టు పాఠాలుగా నేర్చుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications