
హైదరాబాద్: పబ్‌లో గొడవ కారణంగా సస్పెన్షన్‌కు గురైన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ యాషెస్ సిరిస్ కోసం ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో త్వరలో బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టుతో చేరనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇందు కోసం బెన్ స్టోక్స్ సోమవారం న్యూజిలాండ్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అక్కడ బెన్ స్టోక్స్ కాంటెర్బరి తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి యాషెస్ సిరిస్‌లో ఆడాలని ఎప్పుడు పిలుపు వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలని స్టోక్స్ న్యూజిలాండ్ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. 'స్టోక్స్ మా తరఫున ఆడాలని కోరుకుంటున్నాం. అందుకోసం మేం అతడి ప్రతినిధితో చర్చలు జరుపుతున్నాం' అని కాంటెర్బరి క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది.

సెప్టెంబర్ నెలలో ఓ నైట్ క్లబ్‌లో తప్పతాగి ఇద్దరు వ్యక్తులపై దాడి కేసులో బెన్ స్టోక్స్‌ను ఆ దేశ బోర్డు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవాళీలో బెన్ స్టోక్స్ ఆడేందుకు ఈ సస్పెన్షన్ ఎలాంటి అడ్డంకాబోదు. నిజానికి బెన్ స్టోక్స్ న్యూజిలాండ్‌లోనే జన్మించాడు.
బెన్ స్టోక్స్ తండ్రి ఇంగ్లాండ్‌లో రగ్బీ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో స్టోక్స్‌కు కూడా చిన్నప్పుడే ఆ దేశానికి వెళ్లాడు. ఆ తర్వాత స్టోక్స్ తల్లిండ్రులు క్రైస్ట్‌చర్చ్‌కు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు బ్రిస్టల్ నైట్ క్లబ్ కేసుకు సంబంధించి సోమర్సెట్ పోలీసులు స్టోక్స్‌ను మళ్లీ విచారణకు పిలవపోవడం కలిసొచ్చే అంశం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.