
హైదరాబాద్: కోర్టులో కేసు నడుస్తోండగా ఏ జట్టులోకి ఆడేందుకు క్రీడాకారులకు అనుమతి లేదు. స్టోక్స్ విషయంలోనూ అలానే జరిగింది. అయితే కోర్టు మినహాయింపులను ఇచ్చినట్టే ఇచ్చి షరతులను విధిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి బెన్ స్టోక్స్ వాదనను వినేందుకు కోర్టు హాజరుకావాలని స్టోక్స్‌కు సూచించింది.

తన కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టిన దాడి కేసులో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తాను నిర్దోషినని కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. గత ఏడాది సెప్టెంబరు 25న వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ ముగించుకున్న అనంతరం రాత్రి అలెక్స్ హేల్స్‌తో కలిసి నైట్ క్లబ్‌కు వెళ్లిన స్టోక్స్.. ఇద్దరు వ్యక్తులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డ వైనం కెమెరాలకు చిక్కింది. ఈ విషయంపై వాదనను వినిపించేందుకు కోర్టు అనుమతినిచ్చింది.
ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ మంగళవారం మొదలైంది. అతను బ్రిస్టల్ మేజిస్ట్రేట్స్ కోర్టుకు హాజరయ్యాడని.. నాటి దాడికి సంబంధించి తన తప్పేమీ లేదని స్టోక్స్ వాంగ్మూలం ఇచ్చినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 12న జరగనుంది. ఆ రోజు మళ్లీ స్టోక్స్ విచారణకు హాజరవుతాడు.
న్యూజిలాండ్ జట్టుతో ఈ నెల 25న ఆరంభమయ్యే వన్డే సిరీస్‌లో స్టోక్స్ పాల్గొంటాడు. దీని నిమిత్తం అతను బుధవారం న్యూజిలాండ్‌కు బయల్దేరనున్నాడు. దాడి కేసు వల్ల స్టోక్స్ దాదాపు ఐదు నెలలుగా ఇంగ్లాండ్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కూడా ఆడలేదు.
విచారణంలో తాను చేయి చేసుకున్న మాట వాస్తవమే. కానీ, తన తప్పేమి లేదని స్టోక్స్ పేర్కొన్నాడు. 2017 సెప్టెంబరు నెలలో జరిగిన వివాదంతో తన కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.