Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేలం కోసం 3.30 గంటలకు నిద్రలేచా: రూ. 14.50 కోట్లపై బెన్ స్టోక్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్ కోసం నిర్వహించిన వేలంలో తనకు అత్యధిక ధర పలకడంపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. బెన్ స్టోక్స్‌ను రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది. పదేళ్ల ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా స్టోక్స్‌ నిలిచాడు.

మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో యువరాజ్‌ సింగ్‌ తర్వాత భారీ మొత్తంలో అమ్ముడైన ఆటగాడిగా బెన్‌ స్టోక్స్ నిలిచాడు. ఇదిలా ఉంటే బెంగుళూరులో జరిగిన ఐపీఎల్ వేలంపై బెన్ స్టోక్స్ అమితాసక్తిని కనబర్చినట్లు చెప్పుకొచ్చాడు. వేలాన్ని వీక్షించేందుకు గాను తెల్లవారుజామునే మేల్కొన్నానని చెప్పాడు.

అలారం పెట్టుకుని మరీ లేచా

అలారం పెట్టుకుని మరీ లేచా

'వేలాన్ని ప్రత్యక్షంగా చూడాలని అలారం పెట్టుకుని తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేచాను. వేలంలో నా వంతు వచ్చే వరకు 40 నిమిషాలు వేచి చూశాను. అలా ఉత్సాహంగా ఎదురు చూశాను. నిజానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు ట్విటర్‌ను ఫాలో అయ్యాను' అని స్టోక్స్ చెప్పాడు.

ట్విట్టర్‌ను ఫాలో అయ్యా

ట్విట్టర్‌ను ఫాలో అయ్యా

'అయితే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడలేదు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నోటిఫికేషన్లను ట్విట్టర్‌లో రీప్రెష్ కొడుతూనే ఉన్నాను. నెటిజన్లు పెట్టిన ట్వీట్లు చూసి పూణె ప్రాంచైజీ నన్ను దక్కించుకుందని తెలుసుకున్నాను' అని చెప్పాడు.

నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం

నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం

'నా కనీస ధరకు ఇది ఏడు రెట్లు. నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. నాకు చెల్లించే దానికి జట్టు గెలిచే గేముల్లో నా పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. ఒక జట్టు నా కోసం అంత పెద్ద మొత్తంలో వెచ్చిందంటే నా అవసరం ఆ జట్టుకు ఎంతో ఉంది' అని స్టోక్స్ అన్నాడు.

నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర

నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర

'ఇది ఎన్ని కోట్లు నిజంగా నాకు తెలియదు. అయితే ఇది నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర. నాకు మాటలు రావడం లేదు. గత కొద్ది రోజులుగా నా జీవితంలో అన్ని మంచి విషయాలు వింటున్నాను. ముఖ్యంగా ఈ వారం నాకు బాగా కలిసొచ్చింది' అని స్టోక్స్‌ అన్నాడు.

భారీ ధర పలికిన విదేశీ ఆటగాడిగా స్టోక్స్‌

భారీ ధర పలికిన విదేశీ ఆటగాడిగా స్టోక్స్‌

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా బెన్ స్టోక్స్‌ గుర్తింపు పొందాడు. స్టోక్స్ తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రూ. 12 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. సోమవారం బెంగుళూరులో నిర్వహించిన వేలంలో పూణె జట్టు స్టోక్స్‌ను రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+