Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌తో వన్డే సిరిస్‌కు బెన్ స్టోక్స్: జట్టుని ప్రకటించిన బోర్డు

Stokes in England squad for Australia ODIs, but his availability remains unclear

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్ కోసం గురువారం 16 మంది సభ్యులతో కూడిన జట్టుని ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో సస్పెన్షన్‌కు గురైన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌, అలెక్స్‌ హేల్స్‌ చోటు దక్కించుకున్నారు.

గత సెప్టెంబర్ నెలలో బ్రిస్టల్‌లో నైట్ క్లబ్‌లో ఓవ్యక్తిపై దాడి చేసిన కేసులో బెన్ స్టోక్స్, అలెక్స్‌ హేల్స్‌‌పై ఆ దేశ్ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ ఆస్ట్రేలయాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌కు దూరమయ్యారు.

నైట్ క్లబ్ గొడవలో బెన్ స్టోక్స్‌ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఎటువంటి ఛార్జి లేకుండా విచారణతో వదిలి పెట్టారు. దీనిపై సోమర్సెట్ పోలీసులు నుంచి బోర్డుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో వన్డే సిరిస్‌కు బెన్ స్టోక్స్‌కు చోటు కల్పించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

'సోమర్సెట్ పోలీసుల నుంచి అధికారిక సమచారం వచ్చింది. స్టోక్స్‌పై ఎటువంటి ఛార్జి నమోదు కాలేదు. దీంతో అతడు జట్టుకు అందుబాటులో ఉంటాడని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఈసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు. జనవరి 14 నుంచి మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో గురువారం ఇంగ్లాండ్ సెలక్టర్లు వన్డే జట్టును ప్రకటించారు. అయితే వీరిద్దరూ తుది జట్టులో చోటు దక్కించుకుంటారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఇంగ్లాండ్ ఓటమి పాలైంది.

ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపికపై ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ మాట్లాడుతూ వన్డేల్లో జానీ బెయిర్ స్టో, జాసన్ రాయ్‌లు టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల కాలంలో ఈ ఇద్దరూ ఓపెనర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడాడు.

ఇంగ్లాండ్ వన్డే జట్టు:
Eoin Morgan (captain), Moeen Ali, Jonny Bairstow, Jake Ball, Sam Billings, Jos Buttler (wicketkeeper), Tom Curran, Alex Hales, Liam Plunkett, Adil Rashid, Joe Root, Jason Roy, Ben Stokes, David Willey, Chris Woakes, Mark Wood

Story first published: Thursday, December 7, 2017, 12:44 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+