Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టెయిన్ లేకున్నా పరవాలేదు: రబడ

Steyn won't bowl further in first Test, could miss rest of series

హైదరాబాద్: భారత్‌తో తొలి టెస్టుకు తమ జట్టు అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ అర్ధంతరంగా దూరమైనప్పటికీ.. తాము మ్యాచ్‌ గెలిచే అవకాశాన్ని విడిచిపెట్టకూడదని దక్షిణాఫ్రికా యువ పేసర్‌ కాగిసో రబాడ అన్నాడు.

'మేం అదృష్టవశాత్తూ నలుగురు సీమర్లతో బరిలోకి దిగాం. కాబట్టి మిగతా పనిని ముగ్గురే పూర్తి చేయాలి. స్టెయిన్ దూరం కావడం ఎప్పుడూ బాగుండదు. అందులోనూ గాయం నుంచి కోలుకుని ఇప్పుడే పునరాగమనం చేశాడు. అతడికి నా సానుభూతి. ఐతే ముగ్గురు పేసర్లతోనే మేం ఈ మ్యాచ్‌ గెలిచే మార్గం చూడాలి'అని రబాడ అన్నాడు.

భారత తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా రెండో రోజు తమ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హార్దిక్‌ పాండ్య గురించి టీ విరామం జట్టంతా చర్చించుకుని ఒక ప్రణాళికతో మైదానానికి తిరిగొచ్చి అతడిని ఔట్‌ చేసినట్లు రబాడ వెల్లడించాడు.

'అతడి జోరును అడ్డుకోవడానికి ఏం చేయాలా అని చర్చించుకున్నాం. అందుకే మూడో సెషన్లో అరౌండ్‌ ద వికెట్‌ బౌలింగ్‌ చేశాం. అది పని చేసింది. హార్దిక్‌ తన సహజ శైలిలో షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అలాఆడితే ప్రత్యర్థి జట్టు వెనుకబడేందుకు అవకాశముంది. అందుకే మేం ప్రతి దాడి చేశాం' అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 10:09 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+