Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్ జట్టుకు సెలెక్ట్ అయ్యే తొలి ప్లేయర్ దినేష్ కార్తీక్.. దక్షిణాఫ్రికా దిగ్గజం వ్యాఖ్యలు

 steyn says that if Dinesh karthik Continuing is mojo He will be the First to select worldcup Team

బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్నందున దినేష్ కార్తీక్‌ను టీమిండియా టీ20ప్రపంచకప్ జట్టులో తప్పనిసరిగా చేర్చాలని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ సూచించాడు. ఇక రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో కార్తీక్ 27బంతుల్లో 55పరుగులు చేయడంతో ఇండియా 82పరుగుల భారీ విజయం సాధించగలిగిన సంగతి తెలిసిందే. అనుభవజ్ఞుడైన వికెట్‌ కీపర్ కమ్ బ్యాటర్ అయిన దినేష్ కార్తీక్.. 2006 డిసెంబర్‌లో జరిగిన మొట్టమొదటి టీ20మ్యాచ్ ఆడిన భారత జట్టు సభ్యులలో ఒకడు. ఆ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇక మొన్న జరిగిన నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన డీకే.. అంతర్జాతీయ కెరీర్లో అరంగేట్రం చేసిన 16ఏళ్లకు హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. 'డీకే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంవత్సరం అతను దినదినా మెరుగవుతున్నాడు. అతను వికెట్ కీపర్ కావడం వల్ల ఆటను బాగా అర్థం చేసుకోగలిగే కెపాబిలిటీ ఉంది. బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలని చూస్తారో అతనికి తెలుసు. అతను బౌలర్ల వేరియేషన్లను అర్థం చేసుకుంటాడు. చాలా మంచి నైపుణ్యంతో వివిధ రకాల శైలిలో హిట్ చేయగలడు. రివర్స్ స్వీప్‌లు, స్వీప్‌లు, ల్యాప్‌ షాట్లు ఆడగలడు. బౌలర్ రనప్ మరియు అతని మూమెంట్ బట్టి అతను ఏ విధంగా బౌలింగ్ చేయబోతున్నాడో కూడా అంచనా వేయగలడు' అని ESPNcricinfoతో స్టెయిన్ చెప్పాడు.

'డీకే అతను ఎంత క్లాస్ ప్లేయరో చాటేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇండియా ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఫామ్‌లో ఉన్న డీకేను జట్టులోకి తీసుకోవాలి. డీకే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఈ ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ సంవత్సరం చివరిలో ప్రపంచ‌కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లే ఫ్లైట్‌లో టీమిండియా తరఫున బుక్కయ్యే తొలి టికెట్ దినేష్ కార్తీక్‌దే' అని స్టెయిన్ పేర్కొన్నాడు. మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలకు కార్తీక్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. వచ్చే వారం నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న రెండు టీ20లకు కూడా కార్తీక్ ఎంపికయ్యాడు. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్‌ను 2-2తో సమం చేయడంతో నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే నిర్ణయాత్మక అయిదో టీ20 రసవత్తరంగా సాగే అవకాశముంది.

Story first published: Sunday, June 19, 2022, 16:02 [IST]
Other articles published on Jun 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+