Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ రికార్డు బద్దలు: పెర్త్ టెస్టులో స్మిత్ నమోదు చేసిన రికార్డులివే

Steven Smith slams double century, breaks Sachin Tendulkar's 18-year-old record

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. 92 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన స్మిత్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.

138 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కి ఇది 22వ సెంచరీ కావడం విశేషం. దీంతో టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో వ్యక్తిగా స్మిత్‌ అవతరించాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టాడు.

టెస్టుల్లో సచిన్‌ 22 సెంచరీలు సాధించేందుకు 114 ఇన్నింగ్స్‌లు తీసుకోగా... స్టీవ్‌ స్మిత్‌ 108 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. స్మిత్ కన్నా ముందు డాన్‌ బ్రాడ్‌మన్‌ (58 ఇన్నింగ్స్‌), సునీల్‌ గావస్కర్‌ (101 ఇన్నింగ్స్‌) మాత్రమే ముందున్నారు. స్మిత్‌ డబుల్ సెంచరీ సాధించే క్రమంలో ఈ ఏడాది 1000 పరుగుల మైలురాయిని దాటేశాడు.

121 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఉండగా ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగుల్ని తన ఖాతాలో వేసుకన్నాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది కూడా స్మిత్‌ వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించిట్లు అయింది. 2014-17 నుంచి స్మిత్‌ ప్రతీ ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని నమోదు చేశాడు.

వరుసగా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సార్లు వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో ఆసీస్‌ మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ (5 సంవత్సరాలు) ముందు వరుసలో ఉన్నాడు. 2001 నుంచి 2005 వరుస సంవత్సరాల్లో హేడెన్‌ వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించాడు.

ఆ తర్వాత స్మిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. స్మిత్ తర్వాతి స్ధానంలో బ్రియాన్‌ లారా (వెస్టిండీస్‌), కెవిన్‌ పీటర్సన్‌ (ఇంగ్లండ్‌), ట్రెస్కోథిక్‌ (ఇంగ్లండ్‌)లు ఉన్నారు. ఈ ముగ్గురూ వరుసగా మూడు సంవత్సరాల్లో వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో పుజారా(1140) తొలి స్థానంలో ఉండగా, డీన్‌ ఎల్గర్‌ (1097) రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లి(1059) మూడో స్థానంలో, కరుణరత్నే(1031) నాలుగో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత చండిమాల్‌(1003), స్టీవ్‌ స్మిత్‌ (1001)లు ఉన్నారు

ఇక, ఇక మూడో టెస్టు మూడో రోజు సెంచరీతో నిలిచిన స్టీవ్‌స్మిత్‌ (229 బ్యాటింగ్‌; 390 బంతుల్లో 28×4, 1×6) నాలుగో రోజైన శనివారం డబుల్ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా 1971 తర్వాత యాషెస్‌ సిరీస్‌లో డబుల్ సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు.

అంతేకాదు యాషెస్‌ సిరీస్‌లో అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించి దిగ్గజ ఆటగాడు బాబ్‌ సింప్పన్‌ సరసన నిలిచాడు. యాషెస్‌లో ఇది స్మిత్‌కు రెండో డబుల్‌ సెంచరీ కాగా, సర్‌ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ (8) తొలిస్థానంలో, వాల్టర్‌ హామ్మొండ్‌ (4) రెండో స్థానంలో ఉన్నారు. గతంలో బాబ్‌ సింప్సన్‌ యాషెస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించాడు.

Story first published: Sunday, December 17, 2017, 10:49 [IST]
Other articles published on Dec 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+