హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-0తో ఓటమి పాలై టెస్టు సిరిస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి అడిలైడ్‌లో జరగనున్న మూడో టెస్టులో సమూల మార్పులకు క్రికెట్ ఆస్ట్రేలియా శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే దక్షిణాఫ్రికాతో వన్డే సిరిస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా, టెస్టు సిరిస్‌ను కూడా కోల్పోయింది. కనీసం మూడో టెస్టులోనైనా గెలవాలనే పట్టుదలతో జట్టులోకి కొత్త వాళ్లను తీసుకుంటున్నట్లు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తెలిపాడు. దీంతో అడిలైడ్ టెస్టులో రెన్‌షా, జాక్సన్ బ్రిడ్, పీటర్ హెండ్స్‌కోబ్ ఆసీస్ తరపున టెస్టుల్లో ఆరంగేట్రం చేయనున్నారని స్మిత్ తెలిపాడు.

ఈ ముగ్గురిలో 19 ఏళ్ల రెన్‌షా ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా తరుపున రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన నిక్ మాడిన్సన్ కూడా టెస్టు జట్టులో చోటు కల్పించామని స్మిత్ వెల్లడించాడు.
దక్షిణాఫ్రికాతో ఆడనున్న సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లను గెలవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తామని స్మిత్ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఈ సిరిస్‌లో ఆసీసీ పుంజుకుంటే తమ భవిష్యత్ క్రికెట్ కూడా బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.