Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా ఓటమి: ఐపీఎల్‌పై స్టీవ్ వా సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టీవ్ వా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు వరుస ఓటములపై స్టీవ్ వా భిన్నంగా స్పందించాడు. టెస్టు, వన్డే క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా జట్టు ఇటీవల కాలంలో తడబడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన వరుస సిరిస్‌లలో ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలవడంతో పాటు ఏకంగా క్లీన్ స్వీప్‌కి గురైంది. ఈ క్రమంలో జట్టుని ఉద్దేశించి స్టీవ్ వా చేసిన వ్యాఖ్యలకు ప్రాదాన్యత సంతరించుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఒత్తిడి బాగా పెరిగిందని, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఆస్ట్రేలియా జట్టు వైఫల్యానికి ఓ కారణంగా స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఏప్రిల్, మే నెలలో బ్రేక్ ఉంటుంది. అదే సమయంలో ఐపీఎల్‌లో ఉండటంతో ఆటగాళ్లు అందులో ఆడటం, ఆ వెంటనే తీరికలేని సిరీస్ షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు అలసటతో పాటు ఒత్తిడికి గురువతున్నారని స్టీవ్ అభిప్రాయపడ్డాడు.

Steve Waugh takes dig at Aussie players, asks to skip IPL

ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను గతంలో ఉన్న కెప్టెన్లతో పోలిస్తే చాలా ఒత్తిడికి గురవుతున్నాడని వా పేర్కొన్నాడు. మేము ఆడిన రోజులతో ఇప్పటి రోజులను పోలిస్తే షెడ్యూల్స్ తీరిక లేకుండా ఉన్నాయని, అదే విధంగా సౌకర్యాలు కూడా కాస్తంత మెరుగ్గానే ఉన్నాయని స్టీవ్ వా తెలిపాడు.

కాగా, ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఆస్ట్రేలియా 3-0తేడాతో వైట్ వాష్‌కు గురైంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరిస్‌లో కూడా ఏకంగా 5-0 తేడాతో వైట్ వాష్‌కు గురై చరిత్ర సృష్టించింది. ఇక వచ్చే ఏడాది ఆసీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది.

వాస్తవానికి తనతో పాటు అంతకంటే ముందు తరం క్రికెటర్లు క్లబ్ క్రికెట్ కూడా ఆడారని గుర్తు చేసిన స్టీవ్ వా ప్రస్తుతం క్రికెట్‌లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, బీజీ షెడ్యూల్స్ వల్ల ఆటగాళ్లు గాయాలు పాలవుతున్నారని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+