Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్‌ కోహ్లీ ఆధునిక తరానికి హీరో: స్టీవ్‌ వా

Steve Waugh says Virat Kohli like the modern-day hero

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆధునిక తరానికి హీరో అని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వా పేర్కొన్నాడు. పోరాట పటిమ, ఓటమిని అంగీకరించని తత్వం అతడిని హీరోని చేశాయని ప్రశంసలు కురిపించాడు. కోహ్లీని అతడి ప్రవర్తన కారణంగానే ఎక్కువ మంది అభిమానిస్తున్నారని వా పేర్కొన్నాడు. క్రికెట్‌పై రూపొందించిన గంట నిడివిగల 'క్యాప్చరింగ్‌ క్రికెట్‌: స్టీవ్‌ వా ఇన్‌ ఇండియా' అనే డాక్యుమెంటరీ ఆవిష్కరణ సందర్భంగా స్టీవ్‌ వా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

'క్రికెట్‌ను కెమెరాలో బంధించడం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకిష్టమైన క్రికెట్‌, ఫొటోగ్రఫీ రెండూ ఇందులో ఉంటాయి. 1986లో తొలిసారి భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను వేడుక చేసుకోవడం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. భారత ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదించే విధానం చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది. స్థానికంగా సందర్శించిన ప్రాంతాలు నాకు జీవితకాల జ్ఞాపకాలను అందించాయి' అని స్టీవ్‌ వా పేర్కొన్నాడు.

'ఈ మధ్యే నేను సందర్శించిన తాజ్‌ మహల్‌, చిన్నస్వామి స్టేడియం, మహారాజా లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌, హెచ్‌పీసీ స్టేడియం, ఓవల్ ‌మైదాన్‌, ఢిల్లీ, కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు ఎన్నెన్నో గాథలు, జీవితకాల జ్ఞాపకాలను అందించాయి. నా డాక్యుమెంటరీ చూసినప్పుడు నా ప్రయాణంలోని ప్రతి భావోద్వేగాన్ని భారత అభిమానులు గుర్తించగలరు; అని స్టీవ్‌ వా అన్నాడు. ఈ డాక్యుమెంటరీకి భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే వాయిస్ ఇచ్చారు. నెల్‌ మిన్‌చిన్‌ దర్శకత్వం వహించగా.. మిథిలా గుప్తా రచన చేశారు.

సచిన్ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, లీసా స్టేల్కర్‌ వంటి మాజీ క్రికెటర్ల ఇంటర్వ్యూలు డాక్యుమెంటరీలో ఉన్నాయి. బాల్యంలో ముంబై మైదానాల్లో క్రికెట్‌ ఆడినప్పుడు ఎలా ఉండేదో సచిన్‌ వివరించాడు. భారత యువత శక్తిసామర్థ్యాలకు వ్యవస్థ ఎలాంటి తోడ్పాటు అందిస్తోందో ద్రవిడ్‌ వెల్లడించాడు. స్టీవ్‌ వా ఆసీస్ తరఫున 168 టెస్టులు, 325 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 35 సెంచరీలు చేశాడు.

గురువారం నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత్ చివరి టెస్టు కోసం సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నది. మొతెరాలో జరిగిన తొలి అంతర్జాతీయ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో.. అదనంగా మరో మూడు రోజులు కలిసిరావడంతో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. సోమవారం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.

Story first published: Tuesday, March 2, 2021, 9:26 [IST]
Other articles published on Mar 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+