న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క‌ప్ కొట్టేది వాళ్లే: జ‌్యోతిష్కుల‌ జాబితాలో చేరిన స‌్టీవ్ వా!

Steve Waugh predicts the winner of the Grand Finale

లండ‌న్‌: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్ మ‌రి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్‌లో విజేత‌గా ఎవ‌రు నిలుస్తార‌నేది ఉత్కంఠత‌కు గురి చేస్తోంది. భార‌త క్రికెట్ జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్‌కు వెళ్ల‌క‌పోయిన‌ప్ప‌టికీ.. క్రేజ్ అనేది త‌గ్గ‌లేదు.

ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్‌, గ‌త ప్ర‌పంచ‌క‌ప్ ర‌న్న‌ర‌ప్ న్యూజిలాండ్‌ను ఢీ కొట్ట‌బోతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా మూడు విభాగాల్లో కూడా ఈ రెండు జ‌ట్లు స‌మ‌వుజ్జీలుగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ- ఇంగ్లండ్ వైపే ఆసక్తి చూపుతున్నారు మాజీ క్రికెట‌ర్లు. ప్ర‌పంచ క్రికెట్ విశ్వ‌విజేత‌గా నిలిచే ఛాన్స్ ఇంగ్లండ్ జ‌ట్టుకే ఉంద‌ని జోస్య్ం చెబుతున్నారు.

యూనివ‌ర్స‌ల్ బాస్ విత్ యూనివ‌ర్స‌ల్ థీఫ్యూనివ‌ర్స‌ల్ బాస్ విత్ యూనివ‌ర్స‌ల్ థీఫ్

బ్లాక్ క్యాప్స్‌ను ఓడించ‌డం సుల‌భం కాదు గానీ..

తాజాగా- ఈ జ్యోతిష్కుల జాబితాలో చేరారు ఆస్ట్రేలియా మాజీ కేప్టెన్ స్టీవ్ వా. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎగ‌రేసుకెళ్లే స‌త్తా ఇంగ్లండ్ టీమ్‌కు ఉంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఫైన‌ల్ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచే జ‌ట్టు ఇంగ్లండేన‌ని తేల్చి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ- కేన్ విలియ‌మ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జ‌ట్టును ఓడించ‌డం సులువుగా జ‌రిగే ప‌ని కాద‌ని అన్నారు.

మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచిన తీరు.. అత్య‌ద్బుత‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చాలా తెలివిగా ఆడింద‌ని అన్నారు. సాధార‌ణ క్రికెట్‌కు భిన్న‌మైన ఆటతీరును ప్ర‌ద‌ర్శించింద‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితుల్లో న్యూజిలాండ్ జ‌ట్టును ఓడించ‌డం అంత సుల‌భం కాద‌ని అన్నారు.

ఇంగ్లండ్ ఆటతీరులో అనూహ్య మార్పులు..

అయిన‌ప్ప‌టికీ- ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకోవాల‌నే క‌ల‌ను ఇవాన్ మోర్గాన్ తీరుస్తాడ‌ని తాను బ‌లంగా విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టు నాణ్య‌మైన క్రికెట్‌ను ఆడుతోంద‌ని, ఇలాంటి జ‌ట్టును తాను ఇదివ‌ర‌కు చూడ‌లేద‌ని అన్నారు. ఆట‌గాళ్లంద‌రూ పూర్తిగా ఆత్మ‌విశ్వాసంతో ఉన్నార‌ని చెప్పారు. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో జ‌రిగిన రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన త‌రువాత‌.. ఇంగ్లండ్ జ‌ట్టు నైతిక స్థైర్యం రెండింత‌లు పెరిగింద‌ని అన్నారు.

ప్ర‌త్య‌ర్థిపై దూకుడుగా ఆడ‌టాన్ని అల‌వాటుగా చేసుకుంద‌ని ప్ర‌శంసించారు. ఇంగ్లండ్ ఆట‌తీరులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయ‌ని, అదే ఆ జ‌ట్టుకు ప్ర‌పంచ‌క‌ప్ అందిస్తుంద‌ని స్టీవ్ వా స్ప‌ష్టం చేశారు. త‌న విజ‌యాల ప‌రంప‌ర‌ను ఆ జ‌ట్టు కొన‌సాగిస్తుంద‌ని అన్నారు.

Story first published: Sunday, July 14, 2019, 12:19 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X