నేను ఫామ్‌లోకి వచ్చా.. ఇక కాచుకోండి.. భారత బౌలర్లకు స్టీవ్ స్మిత్ వార్నింగ్!

IND vs AUS 2020 : Steve Smith వార్న్స్ Team India, Extremely Excited About His Batting

సిడ్నీ: సుదీర్ఘ పర్యటన ప్రారంభానికి ముందు భారత బౌలర్లను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. తాను మునపటి ఫామ్ అందుకున్నట్లు తెలిపాడు. కరోనా బ్రేక్ అనంతరం స్టీవ్ స్మిత్ పెద్దగా రాణించింది లేదు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్లలో దారుణంగా విఫలమయ్యాడు. అనంతరం ఐపీఎల్ 2020 సీజన్‌లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు తాను ఫామ్‌లోకి వచ్చానని తాజాగా స్మిత్ తెలిపాడు.

మునపటి రిథమ్ అందుకున్నా..

మునపటి రిథమ్ అందుకున్నా..

‘గత రెండు మూడు రోజులుగా నేను టచ్‌లోకి వచ్చా. దీన్ని వివరించడం కొంచెం కష్టమే. అయితే నేను మునపటి లయను అందుకున్నా. గతంలోలాగా అలవోకగా షాట్లు ఆడుతున్నా. నేను ప్రయత్నించే ప్రతీ షాట్ క్లిక్ అవుతుంది. నా మునపటి రిథమ్ అందుకున్నా. ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అయితే గత నాలుగు నెలలుగా రాణించలేకపోవడానికి గల కారణం తెలియలేదు. అయితే కరోనా కారణంగా ఎక్కువ కాలం బ్యాటింగ్ చేయకపోవడమే కారణం కావచ్చు.

అప్పుడు కూడా..

అప్పుడు కూడా..

ఐపీఎల్‌లో నేనుపెద్దగా రాణించలేకపోయాను. నా వంతు పాత్రను పోషించలేకపోయాను. కేవలం కొన్ని ఇన్నింగ్స్‌లు మాత్రమే సరిగా ఆడాను. అయితే మళ్లీ ఇప్పుడు మంచి రిథమ్ అందుకున్నా.. ఐపీఎల్‌లో దూరమైంది ఇప్పుడు నాకు దక్కినట్లుగా ఉంది.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు. 2017-18 యాషెస్ సిరీస్‌కు కూడా ఇలానే చెప్పిన స్మిత్ ఆ సిరీస్‌లో 687 రన్స్ చేశాడు. దాంతో ఆసీస్ 4-0 సిరీస్ గెలిచింది.

రోహిత్, విరాట్ లేడని..

రోహిత్, విరాట్ లేడని..

ఇక టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గైర్హాజరీతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ బలహీనంగా మారిన మాట వాస్తవమేనని, అలాగని భారత్‌ను తేలికగా తీసిపారేయలేమని స్మిత్ తెలిపాడు. ఆ ఇద్దరిని భర్తీ చేసే ఆటగాళ్లు భారత జట్టులో చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చాడు. ‘రోహిత్ పరిమిత ఓవర్లలో విధ్వంసకర ఆటగాడు. గత కొన్నేళ్లుగా టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటుతున్నాడు. అతను వన్డే, టీ20 సిరీస్‌లకు అందుబాటులో లేకపోవడం భారత బ్యాటింగ్ లైనప్‌కు బొక్కే. కానీ అతని స్థానాన్ని భర్తీ చేసే నాణ్యమైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లకు భారత జట్టులో కొదవలేదు. 'అని స్మిత్ తెలిపాడు.

 టెస్ట్‌ల్లో కూడా..

టెస్ట్‌ల్లో కూడా..

ఇక రోహిత్‌లానే టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ దూరమవుతున్నా... అతని స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారని ఆ ఆసీస్ ప్లేయర్ తెలిపాడు. విరాట్ కోహ్లీ ఓ నాణ్యమైన బ్యాట్స్‌మన్ అని అందరికి తెలిసిందేనని, గత కొన్నేళ్లుగా అతను తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడన్నాడు. అతని గైర్హాజరీ భారత జట్టు బ్యాటింగ్‌పై ప్రభావం చూపినా.. దాన్ని అధిగమించే ఆటగాళ్లున్నారని చెప్పుకొచ్చాడు.

India vs Australia: నా జీవితానికి సరిపోయేంత చితక్కొట్టా.. మూసుకొని బౌలింగ్ చేయరా.!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, November 24, 2020, 13:58 [IST]
Other articles published on Nov 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X