'స్మిత్ బాధ్యతను విస్మరించడం వల్లే జట్టు, బోర్డు తలదించుకుంది'

హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే అటు జట్టు, ఇటు బోర్డు తల దించుకోవాల్సి పరిస్థితి వచ్చిందని ఆస్ట్రేలియా జట్టు మాజీ కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డాడు.
బాల్ టాంపరింగ్ ఘటన జరిగిన సమయంలో ఆస్ట్రేలియా జట్టు కోచ్‌గా డారెన్ లీమన్ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కోచ్ పాత్ర లేకపోయినా... నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డారెన్ లీమన్ అప్పటి సంఘటన గురించి మాట్లాడాడు.
"బాల్ ట్యాంపరింగ్ చేయాలని బాన్‌క్రాఫ్ట్‌కు వార్నర్ చెప్పినప్పుడు అతను మాకు చెప్పాల్సింది. అపుడే వారించే వాళ్లం. ఎలాగైనా గెలవాలనే కసితో తప్పు చేశారు. వాళ్లు చేసింది చాలా పెద్ద తప్పు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇబ్బందికరమైన అంశం" అని డారెన్ లీమన్ అన్నారు.
"ఈ విషయం తెలిసినా కెప్టెన్ స్మిత్ బాధ్యతతో వ్యవహరించాల్సిందిపోయి మిన్నకుండిపోయాడు. ఈ మొత్తం తతంగాన్ని చూసీ చూడనట్లు వ్యవహరించాడు. అతను వారించినా సరిపోయేది. ఆ తప్పే పెను వివాదానికి దారితీసింది. స్మిత్ తన బాధ్యతను విస్మరించడం ఎంతో మందికి తలవంపులు తెచ్చింది" అని లీమన్ అన్నాడు. 1998 నుంచి 2004 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన లీమన్ 27 టెస్టులు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications