Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బాల్‌ ట్యాంపరింగ్‌ విషయం వారందరికీ తెలుసు.. కానీ స్మిత్‌ ఒక్కడే నిందను తనపై వేసుకున్నాడు'

Steve Smith took blame for ball-tampering scandal to save side says Andrew Flintoff
Ball Tampering Not Done By Steve Smith

లండన్‌: బాల్‌ ట్యాంపరింగ్‌ విషయం ఆస్ట్రేలియా జట్టు సభ్యులందరికీ తెలిసినప్పటికీ..మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ ఒక్కడే ఆ నిందను తనమీద వేసుకున్నాడని ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఆరోపించాడు. 2018లో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ బాల్‌ ట్యాపంరింగ్‌కి పాల్పడ్డారు. స్మిత్‌తో పాటు వార్నర్‌ సంవత్సరం పాటు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.

ట్యాంపరింగ్‌ విషయం తెలియదంటే నేను నమ్మను:

ట్యాంపరింగ్‌ విషయం తెలియదంటే నేను నమ్మను:

తాజాగా ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా‌ జట్టు సభ్యులెవరికీ బాల్‌ ట్యాంపరింగ్‌ విషయం తెలియదంటే నేను నమ్మలేను. ఎవరైనా నాకు ఒక ట్యాంపరింగ్‌ చేసిన బాల్‌ ఇస్తే.. ఓ బౌలర్‌గా నాకు ఆ విషయం ప్రాథమికంగా తెలుస్తుంది. ఆస్ట్రేలియా జట్టుకు ఈ విషయం తెలియదంటే.. నేను నమ్మను. ట్యాంపరింగ్‌ ఉదంతాలు చాలా ఏళ్లుగా సాగుతున్నాయి' అని అన్నాడు.

జట్టును తప్పించేందుకే:

జట్టును తప్పించేందుకే:

'బాల్‌కు సన్‌క్రీమ్ రాసి ఇలాంటి తప్పిదాలకు పాల్పడ్డారు. చేయగలిగిన ప్రతిదాన్ని ప్రయత్నించారు. బంతిపై స్వీట్‌ పూసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్లు మా జట్టుపై సైతం ఆరోపణలు వచ్చాయి. సాండ్‌పేపర్‌తో ట్యాంపరింగ్‌కు పాల్పడటం తప్పు. అది ఓ పిచ్చి పని కూడా. ఆస్ట్రేలియా జట్టు సభ్యులందరూ ఏదో ఒక రకంగా ఈ ఉదంతంలో పాలుపంచుకోలేదంటే నేను నమ్మలేను. జట్టు సభ్యులందరికీ తెలిసినప్పటికీ.. స్మిత్‌ ఒక్కడే ఆ నిందను తనమీద వేసుకున్నాడు. జట్టు సభ్యులందరినీ ఈ ఉదంతం నుంచి తప్పించేందుకే కెప్టెన్‌ ఇలా చేశాడు' అని ఫ్లింటాఫ్‌ ఆరోపించాడు.

ఆస్ట్రేలియాను తలెత్తుకోకుండా చేసింది:

ఆస్ట్రేలియాను తలెత్తుకోకుండా చేసింది:

సాండ్‌ పేపర్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏ స్థాయిలో కుదిపేసిందో అందరికీ తెలిసిందే. దీని కారణంగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొగా.. ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టు సమతూకం దెబ్బతింది. కొత్త సారథిని వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. ఆటగాళ్లు ఫామ్‌ కోల్పోయారు. వరుస ఓటములు వెక్కిరించాయి. ఇలా ఒక్కటేమిటి అడ్డదారిలో గెలుపు కోసం చేసిన తప్పిదం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాను తలెత్తుకోకుండా చేసింది.

ఇంగ్లాండ్‌ అభిమానులు హేళన:

ఇంగ్లాండ్‌ అభిమానులు హేళన:

సంవత్సర నిషేధం పూర్తి చేసుకొని మళ్లీ వార్నర్‌, స్మిత్‌ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రపంచకప్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వార్నర్‌ శతకాలతో చెలరేగగా.. స్మిత్‌ సమయోచిత పోరాటంతో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. ఇంకేముందీ.. వారిపై పడ్డ సాండ్‌పేపర్‌ మచ్చ తుడిచిపెట్టుకుపోయిందనుకున్నారంతా. కానీ.. యాషెస్‌ రూపంలో మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేసింది. నిషేధం పూర్తైన తర్వాత వార్నర్‌, స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌ కలిసి ఆడుతున్న తొలి టెస్టులోనే సాండ్‌పేపర్‌ సెగ తగిలింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌ క్రికెటర్లు జాతీయగీతం ఆలపిస్తుండగా.. ఇంగ్లాండ్‌ అభిమానులు సాండ్‌పేపర్లు చూపిస్తూ హేళన చేశారు.

Story first published: Thursday, April 23, 2020, 13:55 [IST]
Other articles published on Apr 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+