గత కొద్ది రోజులుగా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తుండటంతో జట్టులో అవసరమైన మార్పులు చేసి.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కొత్త జట్లను ప్రకటిస్తున్నాయి ఆయా జట్లు. ఇక ఈ మార్పుల కోసం ఐసీసీ నిర్దేశించిన గడువు (ఫిభ్రవరి 12) కూడా పూర్తవ్వడంతో తాజాగా టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా పలు మార్పులు చేసి స్క్వాడ్స్ ను అనౌన్స్ చేశాయి. అయితే ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ విజేత అయిన ఆస్ట్రేలియా పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏకంగా ఐదుగురు ప్లేయర్ల వరకు గాయపడ్డారు. దీంతో ఐదు మార్పులతో కొత్త జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా.
రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయపడడంతో స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆసీస్ బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాలతోనే నిష్క్రమించాల్సి వచ్చింది. మార్కస్ స్టాయినిస్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. మిచెల్ స్టార్క్ కూడా వ్యక్తిగత కారణాలతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. ఇలా మొత్తంగా ఐదుగురు ప్లేయర్లు గట్టి షాక్ ఇచ్చారు.

ఛాంపియ్స్ ట్రోఫీ కోసం ఆసీస్ కొత్త స్క్వాడ్ ఇదే
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, బెన్ డ్వారిషూస్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్పెన్సన్ జాన్సన్, తన్వీర్ సంఘా, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, మాథ్యూ షార్ట్. ట్రావెల్ రిజర్వ్: కూపర్ కొన్నోల్లీ