Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టీవ్ స్మిత్ వన్ హ్యాండ్ క్యాచ్ చూశారా? (వీడియో)

Steve Smith Stunning One-Handed Catch In World Cup Warm-Up

క్రికెట్ ఆటలో ఏదైనా సాధ్యమే. బ్యాటింగ్‌లో బ్యాట్స్‌మన్‌లు, బౌలింగ్‌లో బౌలర్లు అదరగొడుతుండగా.. ఫీల్డింగ్‌లలో ఆటగాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్ హ్యాండ్ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. ఈ ఘటన న్యూజిలాండ్-11, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్‌ వార్మప్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మే 30 నుండి మెగా టోర్నీ ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇప్పటినుండే కొన్ని జట్ల మధ్య వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్-11, ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్‌ జరిగింది. ఆసీస్ పేసర్ జేసన్ బెండ్రాఫ్ వేసిన బంతిని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ టామ్ లాతమ్ లెగ్ సైడ్ ఫ్లిప్ చేసాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ ఒక్కసారిగా దూసుకొచ్చి డైవ్ చేస్తూ వన్ హ్యాండ్ తో క్యాచ్ పట్టాడు. దీంతో టామ్ లాతమ్ నిరాశగా పెవిలియన్ చేరగా.. ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు ఆటకు దూరమైన స్టీవ్ స్మిత్ తాజాగా ఆసీస్ ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు. స్మిత్ ఏడాది తర్వాత ఆసీస్ జట్టుతో కలవడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్-12లో స్మిత్ గొప్ప ప్రదర్శన ఏమీ లేకున్నా.. ఓ మోస్తరుగా రాణించాడు. అయితే రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవరించిన మ్యాచ్‌లలో మాత్రం తన సత్తా నిరూపించుకున్నాడు.

Story first published: Monday, May 6, 2019, 15:43 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+