Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లగ్జరీ విల్లాను అమ్ముకున్న ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్‌: అంత కష్టం ఏమొచ్చింది?

Steve Smith sells his Sydney Mansion for Rs 30 Crore, here is the reason

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. కొంతకాలంగా గడ్డు రోజులను ఎదుర్కొంటోన్నాడు. ఫామ్‌ను కోల్పోయాడు. తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో స్థానం దక్కించుకుంటోన్నప్పటికీ- పెద్దగా రాణించట్లేదు. అతనిపై అంచనాలు రోజురోజుకూ తగ్గిపోతోన్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న జట్టుతో ఉన్నా లేదనిపించుకుంటోన్నాడు.

ఈ పరిస్థితుల మధ్య స్టీవ్ స్మిత్.. సిడ్నీలోని తన విలాసవంతమైన విల్లాను అమ్ముకోవడం చర్చనీయాంశమైంది. 12.38 మిలియన్ డాలర్లకు దీన్ని అమ్ముకున్నట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. మినీ సినిమా థియేటర్, హీటెడ్ స్విమ్మింగ్ పూల్, ఇతర అత్యాధునిక సౌకర్యాలు ఉన్న విల్లా ఇది. దీన్ని అమ్మేశాడు స్టీవ్ స్మిత్. ఆర్థిక ఇబ్బందుల వల్లే దాన్ని విక్రయించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

రెట్టింపు ధర పలకడం వల్లే ఈ విలాసవంతమైన బంగళాను విక్రయించినట్లు ఆస్ట్రేలియన్ మీడియా పేర్కొంది. సిడ్నీ కింగ్స్ రోడ్‌లో ఉండే ఈ ఇంటిని 6.6 మిలియన్ డాలర్లకు 2020లో కొనుగోలు చేశాడు. దాన్ని భార్య డేనీ విల్లీస్ పేరు మీద బదలాయించాడు. ఇప్పుడు ఆ మొత్తం కంటే రెట్టింపు ఆదాయం వస్తోండటం వల్ల స్టీవ్ స్మిత్ ఆ విల్లాను అమ్మేశాడని తెలిపింది. 12.38 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది ఆస్ట్రేలియా జట్టు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఇవ్వాళే ఆరంభమైంది. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. రెండు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. డేవిడ్ వార్నర్ అయిదు పరుగులకే వెనుదిరిగాడు. కసున్ రజిత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 37 పరుగులు చేసి, రమేష్ మెండిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మార్ముస్ లాంబుషేన్-74, స్టీవ్ స్మిత్-22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Story first published: Friday, July 8, 2022, 13:42 [IST]
Other articles published on Jul 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+