కోహ్లీ అసాధారణ ఆటగాడు.. పరుగుల దాహంతో ఉన్న అతన్ని ఎవరూ ఆపలేరు: స్మిత్

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అసాధారణ ఆటగాడు. అన్ని ఫార్మాట్‌లలో అతడు సాధించిన రికార్డులు అద్భుతం. పరుగుల దాహంతో ఉన్న కోహ్లీని ఎవరూ ఆపలేరు అని స్మిత్ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా స్మిత్, కోహ్లీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొందరు మాజీలు కోహ్లీ గొప్ప అంటే.. మరికొందరు స్మిత్ అని అంటున్నారు. అయితే తనకంటే కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని స్మిత్ అంటున్నాడు.

కోహ్లీని ఎవరూ ఆపలేరు:
తాజాగా స్టీవ్ స్మిత్ ఓ జాతీయ మీడియాతో మాటాడుతూ... 'విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్. అతడు సాధించిన రికార్డులే చెబుతాయి ఎంత అద్భుత ఆటగాడో అని. కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. భవిష్యత్తులో మరిన్నో కొత్త రికార్డులు సృష్టిస్తాడు. కోహ్లీ అసాధారణ ఆటగాడు. పరుగుల దాహంతో ఉన్న అతన్ని ఎవరూ ఆపలేరు. కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా జట్టును నెంబర్‌వన్ స్థానానికి తీసుకొచ్చాడు' అని అన్నాడు.

టీమిండియాను అడ్డుకోవడం అంత సులువు కాదు:
'ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో గెలుపు కోసం టీమిండియా ఆటగాళ్లు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తారు. వారిని అడ్డుకోవడం అంత సులువు కాదు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ నాయకత్వంలో జట్టు అద్భుత విజయాలను సాధించింది. యాషెస్ సిరీస్‌లో పైన్ కీలక పాత్ర పోషించాడు. జట్టును ముందుండి నడిపించాడు. జట్టులోని ప్రతి ఆటగాడు బాగా ఆడుతున్నారు. వార్నర్, ఫించ్, లబుషెన్, కమిన్స్, స్టార్క్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. జట్టు పటిష్టంగా ఉంది' అని స్మిత్ పేర్కొన్నాడు.

సంప్రదాయ ఫార్మాట్‌కే మద్దతు:
'ప్రస్తుతం నాలుగు రోజుల టెస్ట్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కానీ.. నేను మాత్రం ఐదు రోజుల టెస్ట్ క్రికెట్‌నే ఎక్కువగా ఇష్టపడతా. ఇటీవల కాలంలో ఐదో రోజే ఫలితాలు వస్తున్నాయి. ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియదు. మాజీలు చాలా మంది ఐసీసీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఓ స్పష్ట రానుంది. నేను మాత్రం సంప్రదాయ ఫార్మాట్‌కే మద్దతు ఇస్తా ' అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications