బెంగళూరు: ఆస్ట్రేలియా యువ సంచలనం మార్నస్ లబుషేన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. లబుషేన్‌కు ఎంతో ప్రతిభ ఉందని స్మిత్ కొనియాడాడు. లబుషేన్ ఆడేది తొలి వన్డే అయినా.. సొంతమైదానంలో ఆడుతున్నట్లు ఆడాడు అని పేరొన్నాడు. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన లబుషేన్ ఆ సిరీస్ మొత్తం ఆకట్టుకున్నాడు. ఆపై జరిగిన టెస్టుల్లో కూడా పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.
క్యాచ్‌కా బాప్.. గాల్లో డైవ్ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్ పట్టిన కాచోపా (వీడియో)
తాజాగా స్మిత్ మాట్లాడుతూ... 'లబుషేన్ తాను ఆడిన తొలి వన్డేలోనే అద్భుతంగా ఆడాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు. కొన్ని మంచి షాట్లు కొట్టాడు. లబుషేన్ షాట్లను చూస్తేనే తెలిసిపోతుంది అతనికి ఎంత ప్రతిభ ఉందని. అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడని అందరికీ తెలుసు. అయితే టెస్టులతో పాటు వన్డేల్లో కూడా రాణించడం గొప్ప విషయం. లబుషేన్ ఫీల్డర్ల మధ్య నుంచి షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. సొంతమైదానంలో ఆడుతున్నట్లుగానే ఆడాడు' అని అన్నాడు.
గతేడాది టెస్ట్ క్యాప్ సంపాదించినప్పటి నుండి లబుషేన్ 58.05 సగటున పరుగులు చేసాడు. ఇక చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. ఇందులో లబుషేన్ పాత్ర కీలకం. టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న లబుషేన్‌కు వన్డే జట్టులో సీఏ అవకాశం ఇచ్చింది.
లబుషేన్ తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రంను టీమిండియాపై చేసాడు. తొలి వన్డేలో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ సెంచరీలు చేయడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో 47 బంతుల్లో 46 పరుగులు చేసాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి అద్భుతంగా ఆడాడు. వన్డేల్లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగినా సమర్థవంతంగా బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇక మూడో వన్డేలో కూడా 64 బంతుల్లో 54 పరుగులు చేసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు.