నా కెరీర్‌లో ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు.. అశ్విన్ మాత్రం: స్మిత్

మెల్‌బోర్న్: భారత్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ని రెండు టెస్టులోనూ టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అలవోకగా బోల్తా కొట్టించాడు. స్మిత్‌పై అశ్విన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇదే విషయాన్ని స్మిత్ కూడా ఒప్పుకున్నాడు. అశ్విన్ తనపై ఆధిపత్యం ప్రదర్శించాడని రెండో టెస్ట్ అనంతరం స్మిత్ పేర్కొన్నాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత భారత్ బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అజింక్య రహానే తన కెప్టెన్సీ వ్యూహాలతో ఆకట్టుకోవడమే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.

ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు:
మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'రవిచంద్రన్ అశ్విన్ నాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇప్పటివరకు నా కెరీర్‌లో ఏ స్పిన్నర్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. అతడి బౌలింగ్‌లో సరిగ్గా ఆడలేకపోయా. అతడిపై మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. అశ్విన్‌ను కాస్త ఒత్తిడికి గురిచేసి ఉంటే సంతోషించేవాడిని. ఇకపై ఇలాంటి తప్పు జరగనీయను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండటానికి మార్గాన్ని వెతుకుతున్నా' అని తెలిపాడు. స్మిత్ రెండు టెస్టుల్లో విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కూడా 10 రన్స్ మాత్రమే చేశాడు.

29 బంతులు.. ఒక పరుగు:
డే/నైట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కోన్న స్టీవ్ స్మిత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఆఫ్ స్టంప్ లైన్‌పై విసిరిన బంతిని ముందుకు ఫుష్ చేయబోయి స్లిప్‌లో ఫీల్డర్ అజింక్య రహానే చేతికి చిక్కాడు. బంతిని టర్న్ చేయకుండా అశ్విన్ విసరగా.. స్మిత్ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచి రహానే చేతిలో పడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న స్మిత్.. నాటౌట్‌గా నిలిచాడు. అప్పటికే ఆసీస్ విజయాన్ని అందుకుంది.

అశ్విన్ మాయాజాలానికి మరోసారి:
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్.. ఆర్ అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు. 15వ ఓవర్ మూడో బంతికి చేటేశ్వర్ పుజారా క్యాచ్ పట్టడంతో స్మిత్ ఇన్నింగ్స్ ముగిసింది. 8 బంతులు ఎదుర్కొన్న స్మిత్ డకౌట్ అయ్యాడు. స్మిత్ టెస్టుల్లో తొలిసారి భారత జట్టు చేతిలో డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడిలా ఔటవ్వడం అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే తొలిసారి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన అద్భుత బంతికి బోల్డ్ అయ్యాడు. 30 బంతుల్లో 8 పరుగులకు ఔట్ అయ్యాడు.

ఐపీఎల్ 2020లోనూ:
నిజానికి గత కొంతకాలంగా స్టీవ్ స్మిత్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆసీస్ పర్యటనకు ముందు యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ ఎక్కువ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో ఔటైన స్మిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆడేటప్పుడు మాత్రం అశ్విన్‌కి వికెట్ సమర్పించున్నాడు.
రహానేకు స్పెషల్ మెడల్.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? 150 ఏళ్ల చరిత్ర!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications