భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ చివరి రోజున భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడు అతని ఏకాగ్రతను దెబ్బతీయాలని ఆసీస్ ఆటగాడు కోన్‌స్టాస్ రన్నింగ్ కామెంట్రీ చెప్పడం ప్రారంభించాడు. జైస్వాల్ మాత్రం తన ఏకాగ్రత దెబ్బ తినకుండా ఆడాడు. దీనిపై స్మిత్ మాట్లాడుతూ.. జైస్వాల్ కోన్‌స్టాస్ వైపు బంతిని బలంగా కొట్టాలని చూశాడని అన్నాడు.
"యువకుడు జైస్వాల్‌ను చాలా నిరాశకు గురిచేశాడని, ఎడమచేతి వాటం బ్యాటర్ బంతిని అతనిపైకి నేరుగా కొట్టాలనుకున్నాడు. ఒకానొక సమయంలో జైస్వాల్ నిజానికి అతనిపై బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు. కోన్ స్టాస్ నోరు మూసివేయించాలని చూశాడు. అతను మొదటి టెస్ట్‌లో అద్భుతంగా ఆడాడు" అని స్మిత్ పేర్కొన్నాడు. జైస్వాల్ వికెట్ ప్రాముఖ్యతను గ్రహించి.. స్పిన్నర్లకు క్లోజ్-ఇన్ ఫీల్డర్‌గా నిలబడి భారత్ ఓపెనర్‌తో నిరంతరం కబుర్లు చెప్పాడని స్మిత్ వివరించాడు.

కాగా కోన్‌స్టాస్ తన అరంగేట్ర మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. బుమ్రా బౌలింగ్ సిక్స్ కూడా కొట్టాడు. సామ్ కాన్‌స్టాస్ ఇప్పటికే డేవిడ్ వార్నర్‌కు తగిన వారసుడిగా స్థానిక మీడియా పేర్కొంది. 19 ఏళ్ల అతని ఇండియాతో టెస్ట్ లో బాగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 8 పరుగులకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో భారత్ 184 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 140 పరుగులు చేయగా. లబుషగే 72, ఖవాజా 57, కోన్‌స్టాస్ 60 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీశాడు. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేయగా.. జైస్వాల్ 82, కోహ్లీ 36 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్, బోలాండ్, లయన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసింది. ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 155 పరుగులకే కుప్పకూలింది.