Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లబుషేన్‌ లాంటి ఆటగాడు ప్రతి జట్టులో ఉండాలి: స్టీవ్‌ స్మిత్‌

Steve Smith said every team needs a player like Marnus Labuschagne in their side in the shortest format

సిడ్నీ: ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ మార్నస్ లబుషేన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. లబుషేన్‌కు ఎంతో ప్రతిభ ఉందని కొనియాడాడు. అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో లబుషేన్‌ లాంటి ఆటగాడు ప్రతి జట్టుకు అవసరం. ఎందుకంటే అతను వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగుగెడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు అని స్మిత్ పేర్కొన్నాడు.

సొంతమైదానంలో ఆడుతున్నట్లుగానే ఉంది

సొంతమైదానంలో ఆడుతున్నట్లుగానే ఉంది

తాజాగా ముగిసిన భారత పర్యటనలో ఆసీస్ 2-1తో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం ఆసీస్ ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. స్టీవ్‌ స్మిత్‌ క్రికెట్ ఆస్ట్రేలియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు. 'లబుషేన్‌ అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో ఎలా ఎదిగాడో ఇప్పటికే చూసాం. రెండు వన్డేలో అతడు ఆడిన విధానం చూస్తే.. సొంతమైదానంలో ఆడుతున్నట్లుగానే ఉంది. ఈ ప్రదర్శన అతన్ని టీ20ల్లోకి ఎంపిక చేస్తుంది' అని స్మిత్ అన్నాడు.

ప్రతి జట్టుకు లబుషేన్‌ లాంటి ఆటగాడు కావాలి

ప్రతి జట్టుకు లబుషేన్‌ లాంటి ఆటగాడు కావాలి

'లబుషేన్‌ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతున్నాడు. దీని వల్ల రెండు పరుగులు కూడా వస్తున్నాయి. టీ20 క్రికెట్లో ప్రతి జట్టుకు లబుషేన్‌ లాంటి ఆటగాడు అవసరం. అతనికి ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఆడిన తొలి వన్డేలోనే అద్భుతంగా ఆడాడు. స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ బౌలింగ్‌లో ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు. మంచి షాట్లు కొట్టాడు. ఆ షాట్లను చూస్తేనే తెలిసిపోతుంది అతనికి ఎంత ప్రతిభ ఉందని. అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడని అందరికీ తెలుసు. అయితే టెస్టులతో పాటు వన్డేల్లో కూడా రాణించడం గొప్ప విషయం' అని స్మిత్ పేర్కొన్నాడు.

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా

గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్‌ స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన లబుషేన్‌.. ఆ సిరీస్ మొత్తం ఆకట్టుకున్నాడు. ఆపై జరిగిన టెస్టుల్లో (న్యూజీలాండ్, పాకిస్థాన్) కూడా పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. గతేడాది టెస్ట్ క్యాప్ సంపాదించినప్పటి నుండి లబుషేన్‌ 58.05 సగటున పరుగులు చేసాడు. ఇక చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో కైవసం చేసుకుంది. ఇందులో లబుషేన్‌ పాత్ర కీలకం.

టీమిండియాపై వన్డే అరంగేట్రం

టీమిండియాపై వన్డే అరంగేట్రం

లబుషేన్‌ తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రంను టీమిండియాపై చేసాడు. తొలి వన్డేలో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ సెంచరీలు చేయడంతో.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో 47 బంతుల్లో 46 పరుగులు చేసాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి అద్భుతంగా ఆడాడు. మూడో వన్డేలో 64 బంతుల్లో 54 పరుగులు చేసాడు.

Story first published: Tuesday, January 21, 2020, 15:38 [IST]
Other articles published on Jan 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+