Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేమ్ ఓడిపోయిన స్టీవ్‌ స్మిత్‌.. ట్రోల్ చేసిన సతీమణి!!

https://telugu.mykhel.com/tennis/young-girl-shows-off-tennis-skills-while-doing-hula-hoops-027741.html

సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఎక్కడ కూడా మ్యాచ్‌లు జరగడం లేదు. దీంతో ప్రతి ప్లేయర్ తెగ బోర్‌ ఫీలవుతున్నారు. అయితే ఇంట్లో ఉండడం తప్పితే మరొకటి చేసేదేమీ లేకుండాపోయింది. కొందరు క్రికెటర్లు ఇంట్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేసేస్తున్నారు. ఇటీవలే ఐసోలేషన్‌ బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌.. బోర్‌ కొడుతుందని రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

మరోసారి బంతిని వాల్‌కు కొడుతూ క్యాచ్‌ అందుకుంటూ ఉన్న వీడియోను కూడా స్టీవ్ స్మిత్‌ షేర్‌ చేశాడు. అయితే తాజాగా స్మిత్‌, అతని సతీమణి డానీ విల్లిస్‌లు ఒక వీడియో గేమ్‌ ఆడారు. ఇద్దరు కలిసి మారియో కార్ట్‌ వీడియో గేమ్ ఆడగా.. అందులో డానీ గెలిచారు. దాంతో స్మిత్‌కు నిరాశ తప్పలేదు. మనోడు క్రికెట్‌లో ఓటములు ఎదురైనప్పుడు కూడా ఎక్కువగా అప్‌సెట్‌ అవుతాడన్న విషయం తెలిసిందే. ఇక భార్య చేతిలోనే ఓడిపోవడాన్ని సరదాగా తీసుకోకుండా.. కాస్త చిరాకుగా ముఖం పెట్టాడు.

వీడియో గేమ్‌లో ఫన్‌ను ఆస్వాదించావా స్టీవ్ స్మిత్‌ అని డానీ అడగ్గా.. లేదు అంటూ సమాధానం చెప్పాడు. ఎందుకు బాస్‌ అని డానీ మళ్లీ అడగగా.. ఓడిపోతే సరదా ఏముంటుంది అంటూ స్మిత్‌ ముఖం ముడుచుకున్నాడు. మరి ఈ విషయంలో డానీ ఏం చేసిందో. గేమ్ ఓడిపోయిన స్టీవ్‌ స్మిత్‌ను అతని సతీమణి ఇలా సరదాగా ట్రోల్ చేసింది.

కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-13వ సీజన్‌ ఇప్పటికే ఆరంభం కావాల్సి ఉండగా.. లీగ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సీజన్‌లో తిరిగి రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవాలని అనుకున్న స్మిత్‌కు అది తీరేలా కనుబడటం లేదు. ఈ లీగ్‌పై ఎటువంటి స్పష్టత లేకున్నా.. క్రీడాకారులు మాత్రం జరుగుతుందనే ధీమాలో ఉన్నారు. అందులో స్మిత్‌ ఒకడు. ఆసీస్‌కు తిరిగి సారథి కావాలనుకుంటున్న స్మిత్‌..ఐపీఎల్‌లో నాయకుడిగా మళ్లీ సక్సెస్‌ బాట పడితే సీఏ దృష్టిని ఆకర్షించి కెప్టెన్సీ రేసులోకి వచ్చేయచ్చు.

ప్రసుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీలలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు మాజీలు కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అంటే.. మరికొందరు స్మిత్ అన్నారు. ఈ చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. అయితే స్మిత్‌, కోహ్లీలలో ఎవరు బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయంపై తాజాగా పాకిస్తాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ జహీర్‌ అబ్బాస్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఆట పరంగా స్మిత్‌, కోహ్లీలు సమఉజ్జీలు. అయితే టెస్టుల్లో స్మిత్‌ అత్యుత్తమమని అతని రికార్డులు చెపుతున్నాయన్నాడు.

Story first published: Friday, April 24, 2020, 15:21 [IST]
Other articles published on Apr 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+