
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతంపై విచారణ పూర్తి అయి శిక్ష కూడా ఖరారైంది. అయినా వారికి వేదింపులు తప్పడం లేదు. అటు మీడియా నుంచి అభిమానుల నుంచి విమర్శలు వస్తూనే ఉండటంతో స్మిత్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఏడాది పాటు నిషేధానికి గురవడంతో అతడు తన క్రికెట్ కిట్‌ను కూడా గ్యారేజీలో పెట్టేశాడు. కుటుంబంతో సహా తాజాగా స్మిత్ స్వదేశాన్ని వదిలి దుబాయ్ వెళ్లిపోయాడు. జరిగిన తనతో తీవ్రంగా కుంగిపోయిన అతడి కుటుంబం.. కాస్త ఉపశమనం పొందడానికి యూఏఈ వెళ్లినట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా నుంచి గురువారం (మార్చి 29) ఆసీస్ చేరుకున్న స్మిత్ తండ్రి పీటర్‌తో మీడియా సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. మీడియాతో మాట్లాడుతుండగా స్మిత్ బోరున విలపించాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తండ్రి తన బాధను దిగమింగుకుంటూ స్మిత్‌ను భుజం తట్టి ఓదార్చిన దృశ్యం అభిమానులను కంటతడి పెట్టించింది.
మరోవైపు.. ట్యాంపరింగ్ ఉదంతంలో దోషిగా తేలిన డేవిడ్ వార్నర్ విషయం మరింత హృదయ విదారకంగా మారింది. తాజాగా అతడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. మీడియా సమావేశంలో అశ్రువులు నిండిన కన్నీటితో క్రికెట్‌కు తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. నిషేధం తర్వాత అతడు ఇంకా ఆడే అవకాశం ఉన్నా.. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.