Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆశ్చర్యం: స్టీవ్ స్మిత్ డ్రీమ్ టీమ్‌లో కోహ్లీకి దక్కని చోటు

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రకటించిన తన డ్రీమ్ జట్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం కోల్ కతా వేదికగా రెండో జరగనుంది. ఈ వన్డే స్టీవ్ స్మిత్‌కు 100వ వన్డే కావడం విశేషం. ఈ సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్మిత్ పాల్గొన్నాడు.

నా కలల జట్టులో సచిన్, భజ్జీ

నా కలల జట్టులో సచిన్, భజ్జీ

ఈ సందర్భంగా స్మిత్ మీడియాతో మాట్లాడుతూ ‘మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్, హర్భజన్‌ సింగ్‌కు నా కలల జట్టులో స్థానం కల్పించాను. కోహ్లీకి స్థానం కల్పించలేదు. దీనిపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోహ్లీకి స్థానం కల్పించకపోవడంతో మా మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి' అని స్మిత్ పేర్కొన్నాడు.

కోహ్లీ అద్భుతమైన ఆటగాడే కాదు, గొప్ప కెప్టెన్ కూడా

కోహ్లీ అద్భుతమైన ఆటగాడే కాదు, గొప్ప కెప్టెన్ కూడా

'అయితే అటువంటిది ఏమీ లేదు. కోహ్లీ అద్భుతమైన ఆటగాడే కాదు, గొప్ప కెప్టెన్ కూడా. జట్టు విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. వ్యక్తిగతంగా ఇతర ఆటగాళ్లతో విభేదాలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టులో ఫిట్‌నెస్ విలువలు పెంచాడు' అని స్మిత్‌ ఈ సందర్భంగా వివరించాడు.

స్మిత్ కెరీర్‌లో ఇది వందో వన్డే

స్మిత్ కెరీర్‌లో ఇది వందో వన్డే

ఇక, భారత్‌తో జరగనున్న రెండో వన్డే తన కెరీర్‌లోనే ప్రత్యేకమైందని స్మిత్ అన్నాడు. 'ఈడెన్‌లో గతంలో ఆడిన అనుభం నాకు లేదు. ఈ వన్డే నాకెంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది నా 100వ వన్డే. గతంలో ఈ పిచ్‌పై జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు చూశాను. ఈ పిచ్‌పై ఆడాలని ఆసక్తిగా ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని స్మిత్‌ తెలిపాడు.

రెండో వన్డేలో విజయం కోసం ఇలా

రెండో వన్డేలో విజయం కోసం ఇలా

రెండో వన్డేలో విజయం సాధించేందుకు గాను ఆస్ట్రేలియా సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తోంది. చాహల్, కుల్దీప్ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా కసరత్తులు చేసింది. ఇందుకోసం కేకే జియాస్, అశుతోష్ షిబ్రామ్, రూపక్ గుహలాంటి యువ స్పిన్నర్ల బౌలింగ్‌లో మంగళవారం ఇండోర్‌లో ప్రాక్టీస్ చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+