స్టీవ్ స్మిత్‌ రాణించినా.. న్యూజిలాండ్‌దే విజయం

Steve Smiths Classy 89 Not Enough As New Zealand Win World Cup Warm-Up

బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ అర్ధ సెంచరీ (77 బంతుల్లో 89 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో బుధవారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో స్మిత్‌ మునుపటి జోరు చూపించాడు. ప్రపంచకప్‌కు ముందు అర్ధ సెంచరీ చేసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఎలెవెన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. స్మిత్‌కు తోడు ఉస్మాన్ ఖావాజా (56; 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కూడా అర్ధ సెంచరీలు చేశారు. లక్ష్య ఛేదనలో విల్‌ యంగ్‌ (130; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ.. వర్కర్‌ (56; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ టామ్ లాథమ్‌ (69; 5 ఫోర్లు, సిక్స్‌)లు అర్ధసెంచరీలు చేయడంతో న్యూజిలాండ్‌ ఎలెవెన్‌ 47.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసి విజయం సాదించింది. స్టార్క్ రెండు వికెట్లు తీసాడు.

Steve Smiths Classy 89 Not Enough As New Zealand Win World Cup Warm-Up

న్యూజిలాండ్‌ ఎలెవెన్‌లో స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్‌, మార్టిన్ గుప్తిల్, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్ లు ఐపీఎల్ సీజన్-12లో ఆడుతుండడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరు లేకున్నా.. కెప్టెన్ లాథమ్‌ జట్టును ముందుండి నడిపించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్‌ మెరిసినా.. ఐపీఎల్-12లో పరుగుల వరద పారించిన వార్నర్ నిరాశపరిచాడు.

 
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 9, 2019, 9:40 [IST]
Other articles published on May 9, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more