క్రీడాస్ఫూర్తికే విరుద్ధం: స్మిత్ డీఆర్ఎస్ 'చీటింగ్'పై గవాస్కర్
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న తన సహచర ఆటగాళ్లకు సైగలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీరుపై టీమిండియా మాజీలు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తీవ్రంగా తప్పుబట్టారు.
భారత్ Vs ఆస్ట్రేలియా టెస్టు సిరిస్ ఫోటోలు
ఈ వివాదంపై గవాస్కర్ మాట్లాడుతూ స్మిత్ తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించాడు. ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్లో ఉమేశ్ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు. వెంటనే భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు.
వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్ కోంబ్‌ను అడిగాడు. దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్‌ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.

నిబంధనలకు విరుద్ధమని వారించిన అంపైర్ నిగెల్ లాంగ్
ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్‌కు ఇంకా ఒక రివ్యూ మాత్రమే మిగిలి ఉంది. అందుకే స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సభ్యులకు సంకేతాలు పంపాడు.

దీనిని గమనించిన కోహ్లీ అంపైర్‌ను ఆశ్రయించాడు
వాళ్లు అవుట్ కాదని సూచిస్తే స్మిత్ రివ్యూని కోరదామని అనుకున్నాడు. అయితే దీనిని గమనించిన కోహ్లీ అంపైర్‌ను ఆశ్రయించాడు. మైదానంలో ఉన్న హ్యాండ్స్ కోంబ్ వద్దకు వెళ్లి స్మిత్ మాట్లాడుతుండగా అంపైర్ వారిని నిలువరించాడు. అదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లకు దగ్గరగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వచ్చాడు.

స్మిత్ మైదానం వీడిన అనంతరం అంపైర్లతో కోహ్లీ మంతనాలు
దీంతో అప్రమత్తంగా వ్యవహరించిన అంపైర్ మరోసారి స్టీవ్ స్మిత్‌ను మైదానం వీడాల్సిందిగా సూచించాడు. స్మిత్ మైదానం వీడిన అనంతరం ఫీల్డ్ అంపైర్లు, కోహ్లీ జరిగిన దానిపై కాసేపు చర్చించారు. అనంతరం ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది.

రివ్యూపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు
ఈ వివాదంపై సునీల్ గవాస్కర్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ 'కామెంటరీ బాక్స్‌లో ఉన్న చాలామంది ఈ వివాదం గురించి స్పందించారు. డీఆర్‌ఎస్ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని అన్నాడు

ఇది చాలా దారుణమన్న గవాస్కర్
ఇది చాలా దారుణం. హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించిన తర్వాత కూడా స్మిత్ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్ రూమ్ వైపు చూశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీనిపై ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

స్మిత్ తీరును తప్పుబట్టిన మాజీలు
ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రా సైతం స్మిత్ తీరును తప్పుబట్టారు. రివ్యూ తీసుకోవాలా? వద్దా? అనేదానిపై డ్రెసింగ్ రూమ్ నుంచి సైగలు ద్వారా సూచనలు తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని లక్ష్మణ్ ట్వీట్ చేయగా, ఇది మోసం చేయడమేనని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications