Steve Smith: ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమి ఎఫెక్ట్ - స్టీవ్ స్మిత్ షాకింగ్ నిర్ణయం
Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
ఆస్ట్రేలియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్ లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తిగా ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ కూడా మధ్యలోనే వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. కేవలం ఇంగ్లాండ్ పై ఆడిన మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఇక సెమీఫైనల్ లో భారత్ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. మరోవైపు భారత్ ఆడిన అన్నీ మ్యాచుల్లో (గ్రూప్ స్టేజ్ లో బంగ్లా, పాకిస్థాన్, న్యూజిలాండ్) విజయం సాధించింది. సెమీస్ లో ఆసీస్ పై కూడా గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది.
STEVE SMITH CONFIRMS HE WILL CONTINUE IN TESTS & T20Is.
— Johns. (@CricCrazyJohns) March 5, 2025
- Smith wishes to play in 2028 Olympics for Australia. pic.twitter.com/PHPRYMFnGF
సెమీస్ లో టాప్ స్కోరర్ గా...
టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా రాణించాడు. అతడు 96 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇదే అతడికి చివరి వన్డే ఇన్నింగ్స్ అయినట్టైంది. ఆసీస్ తరఫున 170 వన్డేలు ఆడిన స్టీవ్ స్మిత్ ప్రపంచ మేటి బ్యాటర్ గా ఎదిగాడు. అందులో 43.28 సగటుతో స్ట్రైక్ రేట్ 86.96తో 5,800 పరుగులు సాధించాడు. 12 శతకాలు, 35 అర్ధ శతకాలు బాదాడు. వన్డేల్లో స్మిత్‍కు అత్యధిక వ్యక్తిగత స్కోరు 164 పరుగులు. 2016లో న్యూజిలాండ్‍పై దీన్ని చేశాడు. అలానే 28 వికెట్ కూడా తీశాడు.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications