స్మిత్ జాక్ పాట్.. ఎవరూ ఊహించని రికార్డ్.. లంకపై టెస్ట్ సిరీస్ ఆసీస్‌దే
శ్రీలంక పర్యటనలో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. వరుసగా రెండో టెస్ట్ లోనూ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ 242 పరుగులతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో సొంతం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది.
ఓవర్ నైట్ స్కోర్ 211/8తో నాలుగో రోజు రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంక.. కాసేపట్లోనే ఆలౌట్ అయిపోయింది. ఇక 74 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా(44 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 27), ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు) , మార్నస్ లబుషేన్ (39 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 26 నాటౌట్) పరుగులు చేశారు. ప్రభత్ జయసూర్య ఓ వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్ లో 257 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 414 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో లంక 231 పరుగులు చేయగా.. ఆసీస్ 74 పరుగుల ఆధిక్యంతో వెళ్లింది. ఆ లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో వికెట కోల్పోయి 75 పరుగులు చేసి ఛేదించింది.
టెస్టుల్లో తొలి క్రికెటర్ గా..
ఈ మ్యాచ్ లో పలు రికార్డులను ఖాతాలో వేసుకున్న స్టీవ్ స్మిత్.. నాలుగో రోజు తొలి సెషన్ ఆటలోనూ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో ఆసీస్ తరఫున 200 క్యాచులు అందుకున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. నాథన్ లయన్ బౌలింగ్ లో కుశాల్ మెండిస్ క్యాచ్ ను అందుకుని ఈ ఘనత సాధింటాడు.
మొత్తంగా ఈ మ్యాచ్ లో ఐదు క్యాచులు పట్టుకున్నాడు స్మిత్. వరల్డ్ క్రికెట్ లో 200 క్యాచులు అందుకున్న ఐదో క్రికెటర్ గానూ నిలిచాడు స్మిత్. రాహుల్ ద్రవిడ్ (164 మ్యాచుల్లో 210 క్యాచులు), జాక్వెస్ కల్లిస్ (200), మహేలా జయవర్దనె (205), జో రూట్ (207).. స్మిత్ కన్నా ముందు 200 క్యాచులు అందుకున్నారు.
Australia have won the 2nd Test by 9 wickets, sealing the Warne-Murali Trophy 2-0. #SLvAUS pic.twitter.com/l5GHsbkzcH
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 9, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications