For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెలికాఫ్టర్ షాట్‌తో ధోనీలా రెచ్చిపోయిన స్మిత్

 Steve Smith pulls off an MS Dhoni, aces the helicopter shot during local T20 match

హైదరాబాద్: దేశీవాలీ లీగ్‌లలో మెరిసిపోతున్న స్టీవ్ స్మిత్ తాజాగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బంతితో రాణించిన మాజీ కెప్టెన్.. భారీ షాట్లతో చెలరేగిపోయాడు. బాల్ టాంపరింగ్‌కి పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఆ దేశంలో లోకల్ టీ20 మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. వికెట్లను పూర్తిగా విడిచిపెట్టి మరీ బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుని.. బంతుల్ని స్టాండ్స్‌లోకి తరలించేశాడు. ఈ క్రమంలోనే ఓ బంతిని ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడి అభిమానుల్ని అలరించాడు.

2017లో ధోనీతో కలిసి ఆడిన స్టీవ్‌స్మిత్

2017లో ఐపీఎల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ తరఫున ధోనీతో కలిసి ఆడిన స్మిత్ అప్పట్లో ధోనీ ప్రాక్టీస్‌ని దగ్గర నుంచి పరిశీలించినట్లున్నాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడినన్ని రోజులూ అలా ఆడే సాహసం చేయని స్టీవ్‌స్మిత్.. లోకల్ మ్యాచ్‌ల్లో మాత్రం స్వేచ్ఛగా ఆడేస్తున్నాడు. ముఖ్యంగా.. వికెట్లని పూర్తిగా వదిలేసి అతను బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుంటుండటంతో.. బౌలర్లు యార్కర్ విసిరి బౌల్డ్ చేయాలని ఆశిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో పోరంటేనే భయం

ఆస్ట్రేలియాతో పోరంటేనే భయం

స్టీవ్‌స్మిత్‌కి ఇదే వరంలా మారుతోంది. పాదాలకి సమీపంలో పడిన బంతిని.. అతను అలవోకగా స్టాండ్స్‌లోకి తరలించేస్తున్నాడు. మ్యాచ్‌లో అప్పటి వరకు సిక్సర్లతో మెరిసిన స్మిత్.. ఆఖరికి ప్రత్యర్థి వికెట్ కీపర్ అత్యద్భుతంగా డైవ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియాతో పోరంటేనే ప్రత్యర్థుల్లో ఓ రకమైన భయం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆస్ట్రేలియన్లు.. తమ సామర్థ్యంపై తామే అనుమానపడుతున్న పరిస్థితి. ఇందుకు కారణం లేకపోలేదు.

తమ సామర్థ్యంపై తామే సందేహంతో

తమ సామర్థ్యంపై తామే సందేహంతో

పందొమ్మిది వన్డేల్లో పదిహేడింటిలో ఆస్ట్రేలియా ఓడింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనైతే కంగారూల ప్రదర్శన ఘోరం. ఆరు వికెట్ల తేడాతో ఇంకా 20 ఓవర్లుండగానే ఆ జట్టు చేతులెత్తేసింది. ‘ఆటగాళ్లు తమ సామర్థ్యంపై తామే సందేహాపడుతున్నారు. అనుకున్న స్థాయిలో ప్రదర్శన చేయనపుడు ఇలాంటి సందేహాలు రావడం సహజమే. అయితే వీటిని అధిగమిస్తాం. మళ్లీ గాడిన పడతాం' అని ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ అన్నారు.

19 వన్డేల్లో పదిహేడు మ్యాచ్‌ల్లో ఓడిపోయా

19 వన్డేల్లో పదిహేడు మ్యాచ్‌ల్లో ఓడిపోయా

వన్డే ప్రపంచకప్‌నకు మరో 7 నెలలే గడువున్న నేపథ్యంలో ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా గాడిలో పడే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘గత 19 వన్డేల్లో పదిహేడు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. ఏదో ఒకటి చేయాలి. ఇలానే కొనసాగితే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు' అని ఫించ్‌ అన్నాడు.

Story first published: Tuesday, November 6, 2018, 9:37 [IST]
Other articles published on Nov 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+