
టాంపరింగ్ చేద్దామని చర్చించుకున్నట్లు
జీవితంలో కొన్ని చీకటి రోజులు ఉన్నా.. వాటిని అధిగమించగలిగే శక్తి తన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు ఇచ్చారని తెలిపాడు. ఈ సందర్భంగా బాల్ టాంపరింగ్ గురించి చెబుతూ.. మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినపుడు కొందరు ప్లేయర్స్ బాల్ టాంపరింగ్ చేద్దామని చర్చించుకున్నట్లు వెల్లడించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే వాళ్ల మాటలు విన్నాను. అప్పుడే దానిని ఆపే అవకాశం నాకు ఉన్నా అలా చేయలేకపోయాను. అది నా కెప్టెన్సీ వైఫల్యమే.

కచ్చితంగా నాయకత్వ వైఫల్యమే
బాల్ ట్యాంపరింగ్ జరుగుతుందేమో అనిపించింది. ఫీల్డ్‌లో అది జరిగిపోయింది కూడా. ఇది కచ్చితంగా నాయకత్వ వైఫల్యమే. దానికి బాధ్యత కూడా తీసుకున్నాను అని స్మిత్ చెప్పాడు. అయితే బాల్ టాంపరింగ్ గురించి చర్చించుకున్న ప్లేయర్స్ ఎవరో మాత్రం అతడు వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో భాగంగా ఆసీస్ ప్లేయర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లకు ఏడాది, బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చితో స్మిత్‌పై ఉన్న నిషేధం పూర్తవనుంది. నిషేదానికి గురైన స్మిత్ కెనడా, కరేబియన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లీగ్‍లలో ఆడుతున్నాడు.

వన్డే ఫార్మాట్‌ను పొడిగించిన టీ20ల్లా
ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌ను పొడిగించిన టీ20ల్లా ఆడుతున్నారు. సన్నద్ధమవ్వడానికి టీ20 క్రికెట్ మంచి వేదిక. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీ. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడాల్సి ఉంది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, వద్దన్నారు. ఇప్పుడు పాకిస్థాన్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాను. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైతే మంచి సాధనకు ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నాను.

9 నెలల కాలం నేర్చుకోవడానికి
కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉండటం సహజమే. ఇదే క్రమంలో కొన్ని చీకటి రోజులు చూస్తున్నాను. సన్నిహితులు నాకు ఊరడింపునిస్తున్నారు. ఈ 9 నెలల కాలం నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. మానసికంగా పునరుత్తేజం చెందా. దక్షిణాఫ్రికాలో జరిగిన ఘటనను ఒక నాయకుడిగా ఆపాల్సిన బాధ్యత నాదే. అలా చేయకపోవడం నా తప్పే. టిమ్‌పైన్ నాయకత్వం బాగుంది' అని స్మిత్ అన్నాడు.


Click it and Unblock the Notifications
