Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోడ్రన్ శకంలో గ్రేటేస్ట్ బ్యాట్స్‌మన్: స్మిత్‌కు పాంటింగ్ ప్రశంస

Steve Smith on track to become greatest batsman of modern era: Ricky Ponting

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో స్టీవ్ స్మిత్ ఒకడని కొనియడాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా గబ్బా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

తన కెరీర్‌ను ముగించే నాటికి స్మిత్ ఎన్నో మైలురాళ్లను అందుకుంటాడని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా రేడియోకు ఇచ్చిన ఇంటర్యూలో '57 టెస్టుల్లో 61.23 యావరేజితో 21 సెంచరీలు చేయడం సాధారణ విషయం కాదు. యాషెస్‌లో సెంచరీ చేయడం అతనికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అన‍్ని వాతావరణ పరిస్థితిల్లోనూ స్మిత్‌ దూకుడు ఆకట్టుకుంటుంది' అని పాంటింగ్ అన్నాడు.

'ఇదే ఫామ్‌ను స్మిత్‌ కొనసాగిస్తే మాత్రం అతనొక దిగ్గజ ఆటగాడిగా నిలుస్తాడు. క్రికెట్ గ్రేట్స్ అయిన సచిన్ టెండూల్కర్, కల్లిస్‌లతో పోలిస్తే పరుగుల పరంగా స్మిత్ ముందంజలో ఉన్నాడు. సచిన్ టెస్టుల్లో 15వేల పరుగుల చేసేందుకు గాను 200 టెస్టులాడగా, కల్లిస్ 13వేల పరుగులు చేసేందుకు 130కిపైగా టెస్టులాడాడు' అని పాంటింగ్ వెల్లడించాడు.

'వారిలో సగం టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడని స్మిత్‌ 50 మ్యాచ్‌లు ఆడేటప‍్పటికే ఐదువేలకు పైగా పరుగులు చేశాడు. అతని కెరీర్‌ ముగిసే నాటికే మరిన్ని ఘనతలు అతని సొంతం కావడం ఖాయం' అని పాంటింగ్‌ అభిప‍్రాయపడ్డాడు. యాషెస్ సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 2న అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, November 28, 2017, 13:06 [IST]
Other articles published on Nov 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+