Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్‌ను తీసుకోవడానికి కారణం

Steve Smith Named as Rajasthan Royals skipper

హైదరాబాద్: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శనివారం స్టార్ టీవీ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ల నిషేదం అనంతరం ఐపీఎల్ సీజన్‌కు అడుగుపెట్టబోతున్న ఆర్‌ఆర్ జట్టు ఈ సీజన్ కొత్తదైన వైవిధ్యంతో మొదలుపెట్టబోతోంది. ఇంకా రెండు నెలలు ఉన్నప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇటీవల ముంబైలో అందరి కన్నా ముందు జట్టు సభ్యులతో ప్రాక్టీస్ కూడా నిర్వహించి ఆశ్చర్యపరచింది.

ఈ మేరకు స్టార్స్ స్పోర్ట్స్‌తో కలిసి శనివారం ఐపీఎల్ 11వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుని నడిపించేదెవరో అభిమానులతో పంచుకుంది. ఈ తరహాలో ఓ ఫ్రాంఛైజీ తమ కెప్టెన్‌ను ప్రకటించడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ సందర్భంగా షేన్ వార్న్ మాట్లాడుతూ 'వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు జట్టులో ఉన్న నేపథ్యంలో కెప్టెన్ పాత్ర కీలకం. అందరినీ ఒకేతాటిపై నడిపించాల్సిన బాధ్యత అతనికుంది. మైదానం లోపల, బయట జట్టులో మంచి సంస్కృతిని సృష్టించడంలో అతడు సాధనంగా ఉపయోగపడతాడు' అని అన్నాడు. స్టీవ్ స్మిత్‌లో మంచి నాయకత్వ లక్షణాలున్నాయి' అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.

ఈ మధ్యనే ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జట్టుకు ఉత్తమ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ నంబర్ వన్ ర్యాంకును పొందాడు. 2014, 15 సీజన్లలో స్మిత్‌ రాయల్స్‌ జట్టులో ఆడాడు. గత ఐపీఎల్‌లో అతను రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టుకు సారథ్యం వహించి జట్టును ఫైనల్‌ చేర్చాడు.

జట్టు పూర్తి వివరాలు:

1. స్టీవ్ స్మిత్ (రూ.12 కోట్లు-Retained) (CAPTAIN)
2. బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు)
3. రహానే (రూ.4 కోట్లు-RTM)
4. స్టువర్ట్ బిన్నీ (రూ.50 లక్షలు)
5. సంజు శాంసన్ (రూ.8 కోట్లు)
6. జోస్ బట్లర్ (రూ.4.4 కోట్లు)
7. రాహుల్ త్రిపాఠి (రూ.3.4 కోట్లు)
8. డార్సీ షార్ట్ (రూ.4 కోట్లు)
9. జోఫ్రా ఆర్చర్ (రూ.7.2 కోట్లు)
10. గౌతమ్ క్రిష్ణప్ప (రూ.6.2 కోట్లు)
11. ధవల్ కులకర్ణి (రూ.75 లక్షలు-RTM)
12. జయదేవ్ ఉనద్కట్ (రూ.11.5 కోట్లు)
13. అంకిత్ శర్మ (రూ.20 లక్షలు)
14. అనురీత్ సింగ్ (రూ.30 లక్షలు)
15. జహీర్ ఖాన్ పక్టీన్ (రూ.60 లక్షలు)
16. శ్రేయాస్ గోపాల్ (రూ.20 లక్షలు)
17. ప్ర‌శాంత్ చోప్రా (రూ.20 ల‌క్ష‌లు)
18. మ‌హిపాల్ లామ్‌రోర్ (రూ.20 ల‌క్ష‌లు)
19. జ‌తిన్ స‌క్సేనా (రూ.20 ల‌క్ష‌లు)
20. ఆర్య‌మాన్ విక్ర‌మ్ బిర్లా (రూ.30 ల‌క్ష‌లు)
21. దుష్మంత చ‌మీరా (రూ.50 ల‌క్ష‌లు)

Story first published: Sunday, February 25, 2018, 11:16 [IST]
Other articles published on Feb 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+