గబ్బాలో చెత్త ప్రదర్శన: తనకు తానుగా శిక్ష విధించుకున్న స్టీవ్ స్మిత్

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో ఛీఫ్‌గా ఔటైనందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తనను తాను శిక్షించుకున్నాడు. టెస్టుల్లో వంద పరుగులు చేసినప్పుడు స్టీవ్ స్మిత్ చాక్లెట్ బార్‌లు తినే సంగతి తెలిసిందే. అదే సమయంలో భారీ స్కోర్లు చేయకుండా పెవిలియన్‌కు చేరినప్పుడు తనకు తానుగా శిక్ష విధించుకుంటాడు.
గబ్బా వేదికగా ఆదివారం తొలి టెస్టు ముగిసిన తర్వాత స్టీవ్ స్మిత్ టీమ్ బస్సును మిస్సయ్యాడు. దీంతో తనను తాను శిక్షించుకునే ప్రయత్నంలో స్టేడియం నుండి టీమ్ హోటల్ వరకు పరిగెత్తాడు. తొలి టెస్టులో బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగా స్టీవ్ స్మిత్ సుమారు 3 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు.

స్మిత్ మాట్లాడుతూ
స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ "నేను పరుగులు చేయలేనప్పుడు నన్ను నేను శిక్షించుకంటాను. వంద పరుగులు సాధించిన రోజు రాత్రి నాకు నేనుగా చాక్లెట్లను బహుమతిగా ఇచ్చుకుంటాను. అలాగే పరుగులు చేయలేనప్పుడు పరుగు తీయడం లేదా జిమ్‌కు వెళ్లడం అలవాటు. నాకు నేనుగా శిక్షించుకోవడం ఇష్టం" అని చెప్పాడు.

గబ్బా వేదికగా తొలి టెస్టు
గబ్బా వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ బౌలర్ యాసిర్ షా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్(4) పరుగులకే ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్ ఛీఫ్‌గా ఔటైనప్పటికీ... డేవిడ్ వార్నర్, మార్నస్ లబుఛాగ్నే సెంచరీలు సాధించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 580 పరుగులు చేసింది. గబ్బా టెస్టులో స్మిత్ ఫెయిల్యూర్ కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి మరింత చేరువయ్యాడు.

3 పాయింట్ల దూరంలో
ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 రేటింగ్ పాయింట్లు)తో రెండో స్థానంలో నిలవగా... ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(931) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 136 పరుగులతో సెంచరీ సాధించడంతో 25 పాయింట్ల వ్యత్యాసాన్ని కోహ్లీ తగ్గించాడు.

యాసిర్ షా ఔట్ చేశాడు
స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ "అతను (యాసిర్ షా) నన్ను ఔట్ చేశాడు. నేను కొన్ని పరుగులు చేశాను. సెకండ్ ఇన్నింగ్స్‌ల్లో బాగా నెమ్మదిగా ఆడుతున్నాను. నేను కొన్ని ఫంకీ షాట్లు ఆడాను. కాబట్టి నేను చాలా ఆందోళన చెందలేదు. అతడు నన్ను ఔట్ చేసిన తీరు నాకు ప్రేరణ ఇచ్చింది. తర్వాతి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఫేస్ చేసేటప్పుడు క్రమశిక్షణతో ఉంటా" అని స్మిత్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications