స్మిత్ ఆటపై సంచలన వ్యాఖ్యలు.. ఇలాంటి చెత్త సెంచరీలను ఎప్పుడూ చూడలేదు!!

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాది పాటు నిషేధం ఎదుర్కొని గొప్పగా పురాగమనం చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆటపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీవ్ స్మిత్ తన యాక్షన్, టెక్నిక్‌తో చెత్త సెంచరీలు చేశాడన్నారు. స్మిత్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని జాంటీ రోడ్స్ పేర్కొన్నారు.

పరుగుల వరద:
యాషెస్ సిరీస్‌లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో అర్ధ సెంచరీ చేసిన స్మిత్.. నాలుగో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక ఐదవ టెస్టులో కూడా అర్ధ సెంచరీ చేసాడు. మరోవైపు విండీస్ పర్యటనలో కోహ్లీ కూడా రాణించాడు. స్మిత్ యాషెస్ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో 937 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లీని అధిగమించాడు.

వావ్ అనాలనిపిస్తుంది:
తాజాగా కోహ్లీ-స్మిత్‌ల మధ్య పోలిక తెస్తూ జాంటీ రోడ్స్ స్మిత్ ఆట గురించి మాట్లాడాడు. 'కొంతమంది ఆటను చూస్తే వావ్ అనాలనిపిస్తుంది. వారి ఆటను అలానే చూడాలనిపిస్తుంది. షాట్ ఎంత అద్భుతంగా ఉంది అని కూడా చెప్పాలనిపిస్తుంది. కోహ్లీ ఆట అలాగే ఉంటుంది' అని జాంటీ రోడ్స్ అన్నారు.

చెత్త సెంచరీలను చూడలేదు:
'నేను విరాట్ కోహ్లీ ఆటను ఎంజాయ్ చేస్తా. స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్‌లో పరుగులు చేసాడు. కానీ.. స్మిత్ తన యాక్షన్, టెక్నిక్‌తో చెత్త సెంచరీలు చేశాడు. పరుగులు తీస్తూనే ఉన్నాడు కానీ అలాంటి ఆటను నేను ఇంతకుముందు చూడలేదు' అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చారు. ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే స్మిత్ కంటే విరాట్ కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. స్మిత్ కేవలం టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే అత్యుత్తమ ఆటగాడని ఆయన పేర్కొన్నాడు.

గావస్కర్ సరసన స్మిత్:
స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్ 2019లో మొత్తంగా సుమారు 110 సగటుతో 774 పరుగులు చేసాడు. ఒక ఆటగాడు కనీసం నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరీస్ పరంగా చూస్తే.. విండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ (829) తర్వాత స్థానాన్ని స్మిత్ ఆక్రమించాడు. ఇక గావస్కర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 1971 తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో గావస్కర్ 774 పరుగులు చేసాడు. ఈ జాబితాలో రెండు, నాలుగు స్థానాల్లో స్మిత్ ఉండటం విశేషం. 2014-15 సీజన్‌లో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్ 769 పరుగులు సాధించాడు.

మూడో డబుల్ సెంచరీ:
ఈ యాషెస్ సిరీస్ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ అయినప్పటికీ.. స్మిత్ నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. రెండో టెస్టులో ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన రాకాసి బంతికి గాయపడ్డ స్మిత్ మూడో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో గాయపడ్డా తిరిగి బ్యాటింగ్ కొనసాగించడం విశేషం. స్మిత్ యాషెస్ సిరీస్‌లో మూడో డబుల్ సెంచరీ చేసాడు. యాషెస్ సిరీస్‌లో డాన్ బ్రాడ్‌మన్ (8), వాలీ హమ్మాండ్ (4)లు మాత్రమే స్మిత్ కంటే ముందున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications