డేట్ ఫిక్స్: బాల్ టాంపరింగ్ తర్వాత తొలిసారి మీడియా ముందుకు స్మిత్

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో దోషులుగా తేలిన ఈ ముగ్గురిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన ఏడాది పాటు నిషేధం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన తర్వాత సిడ్నీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించిన స్మిత్ మళ్లీ అదే సిడ్నీలో విలేకరులతో మాట్లడనున్నాడు.
డిసెంబర్ 21న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో పాల్గొనున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్, పెర్త్ షాకర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహించనున్నాడు. ఇందులో భాగంగా ఆ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనున్నాడు.
బాల్ టాంపరింగ్ తర్వాత స్టీవ్ స్మిత్ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ తన ఫిట్‌నెస్‌ను మరింతగా పెంచుకునేందుకు క్లబ్ క్రికెట్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం ప్రకటించే ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకోవడమే ప్రస్తుతం స్మిత్ ముందున్న ఏకైక లక్ష్యం.
ఇదే విషయాన్ని ఈ ఏడాది జులైలో కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 సందర్భంగా స్మిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. బాల్ టాంపరింగ్ ఘటన ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెడ్డ పేరు తెచ్చింది. ఈ మచ్చ నుంచి బయట పడేందుకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా ఆ జట్టు కోచ్‌తో పాటు ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలను తీసుకుంది.
బాల్ టాంపరింగ్ ఘటన అనంతరం సిడ్నీ ఎయిర్ పోర్ట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్ ఏమన్నాడంటే!
నేను ఎవరినీ నిందించడం లేదు
'నేను ఎవరినీ నిందించడం లేదు. నేను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌ని. గత శనివారం ఏదైతే జరిగిందో అందుకు కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా. ప్రపంచంలో అత్యుత్తమ ఆటల్లో క్రికెట్ ఒకటి. క్రికెట్ నా జీవితం, మళ్లీ అడుగుపెడతా. నన్ను క్షమించండి, నేను పూర్తిగా నాశమయ్యా. నిర్ణయం పేరిట నేను ఘోర తప్పిదం చేశాను. పైగా దానిని కప్పి పుచ్చుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు నాకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఈ తప్పు నన్ను జీవితం వెంటాడుతుంది' అని స్మిత్ కన్నీటి పర్యంతం అయ్యాడు.
గద్గద స్వరంతో స్టీవ్ స్మిత్
'నాకు జరిగిన ఈ నష్టం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే.. ఇది ఇతరులకు గుణపాఠం కావటమే. ఇది క్రీడా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెట్ నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కొరుకుంటున్నా' అని స్మిత్ గద్గద స్వరంతో చెప్పాడు.
తల్లితండ్రులను చూడడం ఇబ్బందిగా
ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లితండ్రులను చూడడం ఇబ్బందికరంగా ఉందని, మంచి వ్యక్తులు తప్పులు చేస్తుంటారని, కానీ తాను ఓ పెద్ద తప్పు చేసినట్లు స్మిత్ అంగీకరించాడు. దీని పట్ల క్షమాపణలు కోరుతున్నట్లు స్మిత్ తెలిపాడు. తన నాయకత్వంలోని జట్టు వల్ల ఆస్ట్రేలియాకు జరిగిన నష్టం పట్ల క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.
రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా
బాల్ టాంపరింగ్ ఘటనలో దోషులుగా తేలిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంతి ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా విచారణలో తేలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications